MS Dhoni GoldenDuck: ఎంఎస్ ధోని గోల్డెన్ డక్.. ప్రీతి జింటా సంబరాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni: ఐపీఎల్-2024లో భీకర ఫాంలో ఉన్నా.. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి మహేంద్రసింగ్ ధోని ఆఖర్లో రెండు, మూడు ఓవర్లు ఉన్నప్పుడు బ్యాటింగుకు దిగడంతోనే క్లీన్ హిట్టింగ్ తో అదరగొడుతున్నాడు. వచ్చిన బాలును వచ్చినట్లు బౌండరీ లైన్ కి బౌండరీ దాటిస్తున్నాడు. భారీ సిక్సులు బాదుతూ వింటేజ్ ధోనీని గుర్తు చేస్తున్నాడు. అయితే, పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో అతడు ఇలాగే విధ్వంసం సృష్టిస్తాడని ఎల్లో ఆర్మీ ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ, హర్షల్ పటేల్ వేసిన స్లోవర్ ఫుల్ లెంగ్త్ డెలివరీకి స్లాగ్ షాట్ కొట్టేందుకు ట్రై చేసిన ధోని గోల్డెన్ డక్ గా వెనుదిరిగాడు. ఇక, మాహీ వికెట్ తీసినా హర్షల్ మాత్రం సెలబ్రేట్ చేసుకోలేదు.. రెండు చేతులు అలా పైకి ఉంచి సైలెంట్ అయిపోయాడు.
Read Also: CM YS Jagan: సీఎం జగన్ సుడిగాలి పర్యటన.. నేడు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
అయితే, హర్షల్ పటేల్ బౌలింగ్ లో మహేంద్ర సింగ్ ధోని గోల్డెన్ డక్ గా పెవిలియన్ బాట పట్టడంతో స్టాండ్స్ లో ఉన్న పంజాబ్ కింగ్స్ పంజాబ్ సహ యజమాని ప్రీతి జింటా మాత్రం తన సంతోషాన్ని ఆపుకోలేకపోయింది. వెంటనే సీటులోంచి పైకి లేచి సంబరాలు చేసుకోవడం కనిపించింది. కాగా, పంజాబ్ కింగ్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 28 పరుగుల తేడాతో గెలిచింది. చెన్నై ఇచ్చిన 168 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ ఛేదించలేకపోయింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభసిమ్రాన్ సింగ్ 30, శశాంక్ సింగ్ 27 మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ రాణించలేదు.. నిర్ణత 20 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 9 వికెట్ల నష్టానికి 139 పరుగులే చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో రవీంద్ర జడేజా 3, సిమర్జీత్ సింగ్, తుషార్ రెండేసి వికెట్లు తీయగా, శాంట్నర్, శార్దూర్ ఠాకూర్‌కు తలో వికెట్ తీసుకున్నారు.
https://twitter.com/TheJinxyyy/status/1787085650174296096
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!