NTV Telugu Site icon

Virat Kohli: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!

Virat Kohli Century Rcb

Virat Kohli Century Rcb

RCB Opener Virat Kohli Hit 1000 Runs against PBKS: ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) స్టార్‌ ఓపెనర్‌​ విరాట్‌ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌ చరిత్రలో మూడు జట్లపై 1000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (92; 47 బంతుల్లో 7×4, 6×6) హాఫ్ సెంచరీ చేయడంతో ఈ రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌పై విరాట్ 1000 పరుగులు మైలు రాయిని అందుకున్నాడు.

ఐపీఎల్‌ 2024లో విరాట్ కోహ్లీ 600 పరుగుల మార్కును అందుకున్నాడు. ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 634 పరుగులు చేశాడు. తద్వారా ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 600 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. దాంతో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ రికార్డును సమం చేశాడు. విరాట్ 4 సీజన్‌లలో 600 ప్లస్‌ పరుగులు చేశాడు. రాహుల్‌ కూడా 4 సీజన్‌లలో 600 పైగా రన్స్ చేశాడు.

Aslo Read: Akshaya Tritiya 2024: నేడు అక్షయ తృతీయ.. ఈ ‘కనకధారా స్తోత్రం’ వింటే కోటీశ్వరులు అవుతారు!

ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై ఆర్‌సీబీ 60 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 241 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీతో పాటు రజత్‌ పటీదార్‌ (55; 23 బంతుల్లో 3×4, 6×6), కామెరూన్‌ గ్రీన్‌ (46; 27 బంతుల్లో 5×4, 1×6) కూడా మెరిశారు. ఛేదనలో పంజాబ్‌ 17 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. రొసో (61; 27 బంతుల్లో 9×4, 3×6) టాప్ స్కోరర్. మొహ్మద్ సిరాజ్‌ (3/43) మూడు వికెట్స్ తీశాడు.