Nitish Kumar Reddy: ఐయామ్ ఫుల్ హ్యాపీ.. తెలుగోడు నితీష్ రెడ్డి భావోద్వేగం!
- ఐపీఎల్ 2026లో మెరిసిన తెలుగు ఆటగాడు నితీష్ రెడ్డి
- బ్యాటింగ్‌లో 39 పరుగులు, బౌలింగ్‌లో రెండు వికెట్స్
- ఐయామ్ ఫుల్ హ్యాపీ అంటున్న నితీష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar Reddy Happy For His Performance in KKR vs SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఆల్‌రౌండర్, తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి భావోద్వేగం చెందాడు. ఇలాంటి ఇన్నింగ్స్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నా అని, తన కష్టానికి తగిన ఫలితం దక్కిందని చెప్పాడు. చాలా రోజుల తర్వాత మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేయడంతో ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు తెలిపాడు. జట్టుకు విజయాన్ని అందించిన ఈ ఇన్నింగ్స్ తనకు చాలా ప్రత్యేకం అని నితీష్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నితీష్ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్‌లో 24 బంతుల్లో 39 పరుగులు చేసిన నితీష్.. బౌలింగ్‌లో రెండు ఓవర్లలో రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. అద్భుత ప్రదర్శన చేసిన నితీష్ రెడ్డికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
మ్యాచ్ అనంతరం నితీష్ రెడ్డి మాట్లాడుతూ… ‘ఇది నిజంగా నాకు చాలా ప్రత్యేకమైన మ్యాచ్. చాలా కాలంగా ఇలాంటి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కోసం ఎదురుచూస్తున్నాను. సరైన సమయంలో నేను రాణించగలిగా. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా కష్టపడ్డా. కొన్ని బౌండరీలు ఇచ్చినా చివరికి జట్టుకు ఉపయోగపడే ప్రదర్శన ఇచ్చాను. గత సీజన్ నా ప్లాన్ ప్రకారం సాగలేదు. గాయాల కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. బౌలింగ్ కూడా చేయలేకపోయాను. ఆ సమయంలో నా మనసులో నెగటివ్ ఆలోచనలు ఎక్కువగా వచ్చాయి. ఐపీఎల్‌కు ముందు నేను నా బౌలింగ్‌పై బాగా శ్రమించాను. ఇప్పుడు ఆ కష్టానికి ఫలితం దొరికింది. మైదానంలో మంచి ప్రదర్శన చేయడం చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పాడు.
Also Read
- Virat Kohli: ‘ఆస్ట్రేలియాలో కోహ్లీ ఒక ప్రభంజనం’.. ఆర్సీబీ గెలుపుపై ఆసీస్ డిప్యూటీ పీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
- IPL 2026: ఐపీఎల్ 2026 ఫైనల్లో తీవ్ర కలకలం.. ఆర్సీబీ హిట్టర్‌పై భారీ జరిమానా, నిషేధం..
- Virat Kohli: ‘చెయ్యి దించు.. లేదంటే కొట్టేస్తా’.. కృనాల్ పాండ్యాపై కోహ్లీ ఆగ్రహం..
- Royal Challengers Bengaluru: ఆర్సీబీ విజయ రహస్యం విరాట్ కోహ్లీ కాదా..? ‘గుర్తింపు లేని ఈ హీరో’నేనా..?
Also Read: Abhishek Sharma Record: అభిషేక్ శర్మ చరిత్ర.. తొలి భారత ఆటగాడిగా అరుదైన రికార్డు!
తన ఫిట్‌నెస్ గురించి నితీష్ రెడ్డి మాట్లాడుతూ… ‘ప్రస్తుతం నా శరీరం చాలా బాగుంది. ట్రైనర్లు, ఫిజియోలకు ప్రత్యేక ధన్యవాదాలు. వారు నన్ను బాగా చూసుకున్నారు. ఇప్పుడు నేను పూర్తిగా ఫిట్‌గా ఫీలవుతున్నాను’ అని చెప్పాడు. కష్ట కాలాన్ని అధిగమించి తిరిగి ఫామ్‌లోకి వచ్చిన నితీష్ రెడ్డి ఈ ప్రదర్శనతో జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు. రాబోయే మ్యాచ్‌ల్లో కూడా ఇదే ఫామ్ కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ మ్యాచులో సన్‌రైజర్స్ 65 పరుగుల తేడాతో కోల్‌కతాపై గెలిచింది. ఈ విజయంతో ఐపీఎల్ 2026లో ఎస్‌ఆర్‌హెచ్ బోణి కొట్టింది.
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!