NTV Telugu Site icon

Nitish Kumar Reddy: టాలీవుడ్ సూపర్ స్టార్కు వీరాభిమానిని..

Nitish Kumar

Nitish Kumar

సూపర్ స్టార్ మహేశ్ బాబుకు తాను వీరాభిమానిని అని సన్ రైజర్స్ స్టార్ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి తెలిపారు. ‘మా నాన్న కృష్ణ అభిమాని. పోకిరి సినిమా నుంచి నేను మహేశ్ను ఫాలో అవుతున్నా. ఆయన చేసే సినిమాలు చాలా స్ఫూర్తినిస్తాయి’ అని నితీశ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ ఐపీఎల్లో హైదరాబాద్ తరుఫున నిలకడగా రాణిస్తు్న్న నితీశ్.. జట్టులో కీలక ప్లేయర్గా మారి ప్రశంసలు పొందుతున్నాడు.

Calcium: శరీరంలో క్యాల్షియం స్థాయి తగ్గితే ఏమౌతుందో తెలుసా..?

ఇటీవలే.. ఎస్ఆర్హెచ్ టీమ్ మహేశ్ బాబును కలిశారు. అందులో కెప్టెన్ ప్యాట్ కమిన్స్, రాహుల్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి ఉన్నారు. మహేశ్ బాబుతో కలిసి ఫొటోలు దిగారు. మహేష్ కూడా అందరితో మాట్లాడి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇదిలా ఉంటే.. మహేష్ బాబు అనేకసార్లు తనకి క్రికెట్ ఆడడం అంటే చాలా ఇష్టమని చెప్పారు. చాలాసార్లు కూడా ఐపీఎల్లో సన్ రైజర్స్కు సపోర్ట్ చేయడానికి కూడా వచ్చారు.

Supreme Court: ‘‘రాహుల్ గాంధీ పేరు ఉన్నంత మాత్రాన’’.. ఒకే పేరుతో ఉన్న అభ్యర్థుల్ని నిషేధించలేం..

మరోవైపు.. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేస్తోంది. గ్రూప్-స్టేజ్‌లో ఆడిన 10 మ్యాచ్‌లలో ఆరింటిలో విజయం సాధించింది. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక స్కోరు రికార్డు(ఆర్సీబీపై 287)ను సొంతం చేసుకుంది. ఏకంగా మూడు సార్లు 250కి పైగా పరుగులు చేసింది. కాగా.. నిన్న రాజస్థాన్ రాయల్స్తో ఆడిన మ్యాచ్లో సన్ రైజర్స్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్లో బౌలింగ్లో భువీ అదరగొట్టగా, బ్యాటింగ్లో నితీష్ కుమార్ రెడ్డి (76*) పరుగులతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Show comments