ఐపీఎల్ 2024లో భాగంగా.. ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోరు చేసింది. ముంబై ముందు 197 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. కాగా.. ఈ మ్యాచ్ లో కెప్టెన్ డుప్లెసిస్ (61), చివరలో దినేష్ కార్తీక్ (53), రజత్ పాటీదార్ (50) పరుగులతో రాణించడంతో బెంగళూరు భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన కోహ్లీ (3) పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ డుప్లెసిస్ ఈ మ్యాచ్ లో రాణించాడు. ఆ తర్వాత విల్ జాక్స్ (8) పరుగులు చేశాడు.
Hyper Adhi: ఆ తర్వాతనే నేను మళ్లీ షూటింగ్స్ మొదలెడతా.. హైపర్ ఆది..!
రజత్ పాటీదార్ (50) పరుగులతో రాణించాడు. కాగా.. మ్యాక్స్ వెల్ డకౌట్ అయి ఈ మ్యాచ్ లో కూడా నిరాశపరిచాడు. మహిపాల్ లోమ్రోర్ కూడా డకౌట్ అయ్యాడు. సౌరవ్ చౌహన్ (9) పరుగులు చేశాడు. ముంబై బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో చెలరేగాడు. కోయోట్జీ, మద్వాల్, శ్రేయాస్ గోపాల్ తలో వికెట్ తీశారు.
