Site icon NTV Telugu

MI vs GT: ఓవైపు పరుగులు.. మరోవైపు వికెట్లు.. 10 ఓవర్లలో స్కోరు ఇది!

Mi 10 Overs Score

Mi 10 Overs Score

Mumbai Indians Scored 96 In First 10 Overs Against GT: వాంఖడే స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే! టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్.. ఓవైపు పరుగుల వర్షం కురిపిస్తూనే, మరోవైపు వికెట్లు కోల్పోయింది. తొలి 10 ఓవర్లు ముగిసే సమయానికి.. 3 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ శుభారంభం ఇవ్వడం వల్లే.. ముంబై స్కోరు ఇలా పరుగులు పెట్టింది. తొలుత క్రీజులో కుదురుకోవడానికి కొంత సమయం తీసుకున్న ఓపెనర్లు.. ఆ తర్వాత తమ బ్యాట్‌కి పని చెప్పడం మొదలుపెట్టారు. వీళ్లిద్దరు కలిసి కాసేపు జీటీ బౌలర్లలను ‘లెఫ్ట్ అండ్ రైట్’ వాయించేశారు. సిక్సులు, ఫోర్లతో.. మైదానంలో బౌండరీల మోత మోగించేశారు. పవర్ ప్లే (తొలి 6 ఓవర్లు)లో వీళ్లిద్దరు 61 పరుగులు జోడించారు.

SI Anil : రాజకీయ లబ్ది కోసమే బంద్.. నాకు సంబంధం లేదు..

కానీ.. 7వ ఓవర్‌లో మాత్రం రషీద్ ఖాన్ మ్యాచ్ తిప్పేశాడు. తొలి బంతికే రోహిత్ శర్మ వికెట్ పడగొట్టాడు. ఆ వెంటనే ఇషాన్ కిషన్‌ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ పంపించాడు. వీళ్లిద్దరు ఔటయ్యాక.. సూర్యకుమార్ యాదవ్, నేహాల్ వధేరా క్రీజులోకి వచ్చారు. వచ్చి రాగానే.. ఇద్దరు దూకుడుగా ఆడటం స్టార్ట్ చేశారు. నేహాల్ ఒక సిక్స్, మరో ఫోర్‌తో మంచి జోష్ నింపాడు. కానీ.. కాసేపటికే ఇతడు రషీద్ ఖాన్ చేతికి చిక్కాడు. అతని బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో సూర్య, విష్ణు వినోద్ ఉన్నారు. తొలి 10 ఓవర్లలో బాగానే రాణించిన ముంబై జట్టు.. ఆ తర్వాతి 10 ఓవర్లలో ఎంత మేర పరుగులు చేస్తుందో? జీటీకి ఎంత లక్ష్యం ఇస్తుందో చూడాలి. జీటీ బౌలర్ల విషయానికొస్తే.. ఒక్క రషీద్ ఖాన్ మాత్రమే మూడు వికెట్లు తీశారు. మిగిలిన బౌలర్లు ఎక్కువ పరుగులే సమర్పించుకున్నారు.

Population In Slums: మురికివాడల్లో ఎక్కువ జనాభా నివసించే టాప్-12 దేశాలు

Exit mobile version