NTV Telugu Site icon

MI vs CSK: ముగిసిన ముంబై బ్యాటింగ్.. చెన్నై ముందు స్వల్ప లక్ష్యం

Mi Scored 139

Mi Scored 139

Mumbai Indians Scored 139 In 20 Overs Against CSK: ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్‌ని ఎల్ క్లాసికోగా ఫ్యాన్స్ వర్ణిస్తారు. ఐపీఎల్‌లో ఈ రెండు జట్లు అత్యంత ప్రజాదరణ పొందాయి కాబట్టి.. వీటి మధ్య పోరు ఉన్నప్పుడు, దీన్ని వీక్షించేందుకు భారీ స్థాయిలో ప్రేక్షకులు ఎగబడతారు. మైదానాలు నిండిపోవడమే కాదు, స్ర్కీన్స్ ముందు కూడా కూర్చుండిపోతారు. ఈ మ్యాచ్‌కి.. భారత్, పాకిస్తాన్ లెవెల్‌లో ఎలివేషన్స్ ఇచ్చుకుంటారు. అందుకే.. ఈ రెండింటి మధ్య మ్యాచ్ జరిగినప్పుడు, కనీవినీ ఎరుగని ఇన్నింగ్స్ చూడ్డానికి వీలుంటుందని అందరూ ఆశిస్తారు. కానీ.. ఈసారి అలాంటి త్రిల్ మిస్ అయ్యిందని చెప్పుకోవచ్చు. శనివారం ఎంఏం చిదంబరం స్టేడియం వేదికగా చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు చాలా తక్కువ స్కోరుకే చాపచుట్టేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 139 పరుగులే చేసింది. ఒక్క నేహాల్ వాధేరా (51 బంతుల్లో 64) ఒక్కడే అర్థశతకంతో రాణిస్తే.. మిగతా బ్యాటర్లందరూ ఈ మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యారు.

Nushrratt Bharucha: నాకూ ఒకరున్నారు.. సింగర్‌తో డేటింగ్‌పై నుష్రత్ క్లారిటీ

తొలుత టాస్ గెలిచిన సీఎస్కే ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో.. ముంబై బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. ఈసారి రోహిత్ తన స్థానంలో గ్రీన్‌ని ఓపెనర్‌గా పంపించాడు. గత మ్యాచెస్‌లో అతడు మంచి ప్రదర్శనే కనబర్చడంతో.. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా రప్ఫాడిస్తాడని అనుకున్నారు. కానీ.. అతడు 6 పరుగులకే ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ కూడా షాట్ కొట్టబోయి, క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇలా టాపార్డర్‌లో స్టార్ బ్యాటర్లు ఫెయిల్ అయ్యాక వచ్చిన నేహాల్ వాధేరా.. ఆచితూచి ఆడుతూ, తన జట్టుని ఆదుకున్నాడు. తొలుత సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పిన అతడు, ఆ తర్వాత స్టబ్స్‌తో కలిసి జట్టుని ముందుకు నడిపించాడు. అతడు ఉన్నంతవరకూ ముంబై స్కోరు కాస్త ముందుకు కదిలింది. 127 పరుగుల వద్ద అతడు ఔట్ అవ్వగా.. ముంబై మళ్లీ వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో.. 139 పరుగులకే ముంబై చాపచుట్టేసింది. చెన్నై ఈ మ్యాచ్ గెలుపొందాలంటే.. 140 పరుగులు కొట్టాలంతే!

King Charles Coronation: బ్రిటీష్ సామ్రాజ్యంలో 70 ఏళ్ల తర్వాత తొలి పట్టాభిషేకం.. కిరీటాన్ని ధరించిన కింగ్