Mumbai Indians Unwanted Record: ముంబై ఇండియన్స్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే ఇదే మొదటిసారి!
- ముంబై ఇండియన్స్‌కు ఏదీ కలిసిరావడం లేదు
- సొంత మైదానం వాంఖడేలో మరో ఓటమి
- ముంబై ఇండియన్స్ అత్యంత చెత్త రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Indians Unwanted Record in IPL: ఐపీఎల్ 2026లో ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌కు ఏదీ కలిసిరావడం లేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. అన్ని విభాగాల్లో విఫలమవుతూ పరాజయాలను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే మోస్ట్ పాపులర్ టీమ్ ముంబైకి మరో ఓటమి ఎదురైంది. సొంత మైదానం వాంఖడే స్టేడియంలో గురువారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 103 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ముందుగా చెన్నై 6 వికెట్లకు 207 పరుగులు చేసింది. ఛేదనలో ముంబై 104 పరుగులకే కుప్పకూలింది. భారీ తేడాతో ఓడిన ముంబై ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది.
ఐపీఎల్ చరిత్రలో పరుగుల పరంగా (103) ముంబై ఇండియన్స్‌కు ఇదే అతిపెద్ద ఓటమి. ఇంతకుముందు ముంబైకి భారీ ఓటములు నమోదైనప్పటికీ.. ఈ మ్యాచ్‌లోని ఓటమి అంతకు మించి నమోదైంది. 2013లో రాజస్థాన్ రాయల్స్‌పై 87 పరుగుల తేడాతో ఓడిపోవడమే ముంబైకి ఇప్పటివరకు అతిపెద్ద ఓటమి. ఇప్పుడు చెన్నైతో మ్యాచ్ అగ్రస్థానంలోకి వచ్చింది. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 85 పరుగుల తేడాతో, 2011లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై 76 పరుగుల తేడాతో, 2008లో పంజాబ్‌పై 66 పరుగుల తేడాతో ముంబై ఓడింది. కానీ తాజా మ్యాచ్‌లో చెన్నై చేతిలో 103 పరుగుల తేడాతో ఓడటం ముంబై చరిత్రలోనే చెత్త రికార్డుగా నిలిచింది.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
ఐపీఎల్‌లో చెన్నైపై ముంబై చేసిన అత్యల్ప స్కోర్ (104) కూడా ఇదే. ఇంతకుముందు 2021లో దుబాయ్‌లో 136/8 స్కోర్ చేయగా.. ఇప్పుడు ఆ రికార్డు కూడా చెదిరిపోయింది. మరోవైపు ముంబైపై చెన్నై తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 2023 నుంచి ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఆరు మ్యాచ్‌లలో ఐదింటిలో చెన్నై విజయం సాధించింది. ఈ గణాంకాలు చూస్తే.. ఇటీవలి కాలంలో ముంబైపై చెన్నై పూర్తిగా పైచేయి సాధించిందని చెప్పాలి. అంతేకాదు సొంత మైదానం వాంఖడేలో కూడా ముంబైకి ఇదే అతిపెద్ద పరాజయం కావడం విశేషం. మొత్తానికి చెన్నై దెబ్బకి ముంబై ఖాతాలో అత్యంత చెత్త రికార్డులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్‌కు మరిచిపోలేని చేదు అనుభవంగా మిగిలిపోయింది.
తాజావార్తలు
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?