Mumbai Indians Captain: తప్పు సరిదిద్దుకుంటున్న ముంబై మేనేజ్మెంట్.. రోహిత్ శర్మ చేతుల్లో కొత్త కెప్టెన్ ఎంపిక?
- అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్
- ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై దారుణ ప్రదర్శన
- రోహిత్ శర్మ చేతుల్లోనే కొత్త కెప్టెన్ ఎంపిక?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Indians Captaincy Change for IPL 2027: ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీల్లో ఒకటైన ముంబై ఇండియన్స్ (ఎంఐ)లో భారీ సంక్షోభం నెలకొన్నట్లు నెట్టింట వార్తలు వస్తున్నాయి. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియాలు తమ కథనాల్లో పేర్కొన్నాయి. అంతేకాదు ఎంఐ మేనేజ్మెంట్తో సంబంధాలు దెబ్బతినడంతో హార్దిక్ ఫ్రాంచైజీని వీడేందుకు కూడా సిద్ధమవుతున్నాడని సమాచారం. ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై 14 మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే సాధించడం ఈ మార్పులకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
2024 సీజన్‌కు ముందు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి.. హార్దిక్ పాండ్యాకు ముంబై మేనేజ్మెంట్ బాధ్యతలు అప్పగించింది. అప్పటి నుంచి ముంబై తీవ్ర విమర్శలు ఎదుర్కోంటోంది. అభిమానుల నుంచి భారీ వ్యతిరేకత రావడంతో పాటు జట్టు ప్రదర్శన కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఇప్పుడు ముంబై మేనేజ్మెంట్ తమ నిర్ణయాన్ని పునఃపరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి కొత్త కెప్టెన్ ఎంపికలో రోహిత్ శర్మ అభిప్రాయానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నారని సమాచారం. ముంబై తదుపరి కెప్టెన్‌గా ఎవరిని ఎంపిక చేసినా.. ఆ నిర్ణయానికి రోహిత్ మద్దతు తప్పనిసరిగా ఉండనుందని తెలుస్తోంది. గతంలో చేసిన తప్పును మళ్లీ పునరావృతం చేయకూడదని ముంబై యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
- IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
రోహిత్ శర్మ మళ్లీ ముంబై కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం మాత్రం లేదని సమాచారం. ‘ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ రోహిత్ ఆశీర్వాదాలతోనే ఎంపిక అవుతాడు. కానీ రోహిత్ మళ్లీ కెప్టెన్ కాలేడు’ అని భారత మాజీ క్రికెటర్, కోచ్ ఒకరు వెల్లడించినట్లు కథనాలు చెబుతున్నాయి. మరోవైపు హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై కూడా ఆసక్తికర చర్చ సాగుతోంది. కెప్టెన్సీ కోల్పోవడమే కాకుండా.. మేనేజ్మెంట్తో వ్యక్తిగత సంబంధాలు కూడా బాగా లేవని సమాచారం. అందుకే హార్దిక్ ముంబైని విడిచి వెళ్లాలని ఆలోచిస్తున్నాడని తెలుస్తోంది. ‘మీకు కంపెనీ మేనేజ్మెంట్తో మంచి సంబంధాలు లేకపోతే అక్కడ పని చేయగలరా?’ అంటూ ఓ మాజీ ఆటగాడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్‌గా ఎవరిని ఎంపిక చేస్తుందన్నదే ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. యువ ఆటగాడిని ఎంపిక చేస్తారా? లేక సీనియర్ భారత స్టార్కే బాధ్యతలు అప్పగిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో రేసులో ముందువరసలో ఉన్నాడట. సూర్యకు కూడా రోహిత్ మద్దతు ఉంటుందన్న విషయం తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రాను కూడా ముంబైకి తీసుకురావచ్చనే ప్రచారం జరిగింది. అయితే మరో ఫ్రాంచైజీ నుంచి నేరుగా కోచ్ లేదా కెప్టెన్‌ను తీసుకురావడం అంత సులభం కాదని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ముంబైలో మరోసారి భారీ మార్పులు జరగబోతున్నాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హార్దిక్ భవిష్యత్తుపై వచ్చే కొన్ని వారాల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
CM Revanth: మూడు టిమ్స్ ఆసుపత్రులకు ఒకే రిక్రూట్మెంట్ విధానం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
-
Food Safety Raids: హైదరాబాద్‌లోని కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్లెట్లపై ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు.. 9 బ్రాంచీల లైసెన్సులు సస్పెండ్!
-
Nvidia CEO: ఎన్విడియాకు టిమ్ కుక్ ఒక్కరే సరైనోడు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Siddu Jonnalagadda: ఏడాది గ్యాప్ తర్వాత రూట్ మార్చిన సిద్ధు జొన్నలగడ్డ!
-
Iran Crisis: కిడ్నీ నుంచి వృషణాల వరకు.. శరీర అవయవాలను అమ్ముకుంటున్న ఇరాన్ ప్రజలు!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!