Hardik Pandya Fined Rs 24 lakh: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్ తగిలింది. హార్దిక్‌కు రూ.24 లక్షల జరిమానాను ఐపీఎల్ నిర్వాహకులు విధించారు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు గాను హార్దిక్‌కు జరిమానా పడింది. ఈ సీజన్‌లో హార్దిక్‌కు ఫైన్ విధించడం ఇది రెండోసారి. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్‌కు రూ.12 లక్షల ఫైన్ పడింది.
హార్దిక్ పాండ్యా సహా ముంబై ఇండియన్స్ ప్లేయర్లపై కూడా ఐపీఎల్ నిర్వాహకులు కొరడా ఝుళిపించారు. ముంబై ఆటగాళ్లకు రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించనున్నారు. ఈ రెండింటిలో ఏది తక్కువైతే దాన్ని జరిమానాగా విధిస్తారు. ప్లేయింగ్ 11 సహా ఇంపాక్ట్ ప్లేయర్‌కు ఈ జరిమానా పడుతుంది. హార్దిక్ ఈ సీజన్లో ఇప్పటికే రెండుసార్లు స్లో ఓవర్ రేట్ నమోదు చేశాడు. ఇదే మరోసారి పునరావృతం అయితే.. ఓ మ్యాచ్ నిషేదానికి గురవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు భారీగా జరిమానాను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా ఇప్పటికే రెండుసార్లు స్లో ఓవర్ రేట్ నమోదు చేశాడు.
Also Read: Big Saving Days Sale 2024: బిగ్ సేవింగ్ డేస్ సేల్.. మోటో ఎడ్జ్ 40 నియోపై భారీ తగ్గింపు!
ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. సీజన్ ఆరంభంలో ఆలస్యంగా గెలుపు బాట పట్టిన ముంబై.. తాజాగా హ్యాట్రిక్ పరాజయాల్ని ఎదుర్కొంది. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన మాజీ ఛాంపియన్.. కేవలం మూడు విజయాలను మాత్రమే సాధించింది. పాయింట్ల పట్టికలో ముంబై అట్టడుగున నుంచి రెండో స్థానంలో నిలిచింది. మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో గెలిచినా ప్లే ఆఫ్ చేరడం చాలా కష్టం.