Site icon NTV Telugu

MI vs SRH: సన్ రైజర్స్పై ముంబై విక్టరీ.. శతక్కొట్టిన ‘స్కై’

Mi Won

Mi Won

ఐపీఎల్ 2024లో భాగంగా.. సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యాన్ని 17.2 ఓవర్లలోనే చేధించింది. కేవలం 3 వికెట్లు కోల్పోయి ముంబై గెలుపొందింది. ముంబై బ్యాటింగ్ లో సూర్యకుమార్ యాదవ్.. సన్ రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో.. ఆయన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 51 బంతుల్లనే 102 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మొదటగా ముంబై జట్టులో 3 వికెట్లు వెంట వెంటనే కోల్పోయినప్పటికీ.. మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వైపు తిరిగింది. కానీ.. సూర్యకుమార్ మెరుపు ఇన్నింగ్స్ తో మ్యాచ్ తమ వైపు లాగేసుకున్నాడు. సూర్యకు తోడు తిలక్ వర్మ (37*) పరుగులతో రాణించాడు. ముంబై బ్యాటింగ్ లో ఇషాన్ కిషన్ (9), రోహిత్ శర్మ (4), నమన్ ధీర్ డకౌట్ అయ్యారు. హైదరాబాద్ బౌలర్లు వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. అంతేకాకుండా.. పరుగులు బీభత్సంగా సమర్పించుకున్నారు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, కమిన్స్ తలో ఒక వికెట్ తీసుకున్నారు.

Ranjith Reddy: చేవెళ్ళ ప్రజలకు సంక్షేమం చేయడమే నా లక్ష్యం..

అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ 173 పరుగులు చేసింది. భారీ స్కోర్ సాదిస్తుందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లో ఓపెనర్‌ ట్రావిస్ హెడ్‌ అత్యధికంగా 48 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివర్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ 35 పరుగులతో మెరుపులు మెరిపించడంతో సన్‌రైజర్స్ ఈ స్కోర్ చేసింది. సన్ రైజర్స్ బ్యాటింగ్ లో అభిషేక్ శ‌ర్మ(11), మ‌యాంక్ అగ‌ర్వాల్ (5), నితీశ్ కుమార్ (20), హెన్రిచ్ క్లాసెన్ (2), ష‌హ్‌బాజ్ అహ్మద్ (10), మార్కో జాన్‌సెన్ (17), కమిన్స్ (35*), సన్వీర్ సింగ్ (8*) పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో పీయూష్‌ చావ్లా, హార్దిక్‌ పాండ్యా చెరో 3 వికెట్లు పడగొట్టారు. అన్శుల్ కాంబోజ్, బుమ్రాకు తలో వికెట్ దక్కింది.

Yarlagadda Venkata Rao: పేద ప్రజలందరి సొంతింటి కలను నిజం చేస్తాం..

Exit mobile version