NTV Telugu Site icon

MS Dhoni: కొట్టేస్తా నిన్ను.. కెమెరామెన్‌ను బెదిరించిన ఎంఎస్ ధోనీ (వీడియో)!

Ms Dhoni Cameraman

Ms Dhoni Cameraman

MS Dhoni threatens to throw the bottle on Cameraman: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2024లో అదరగొడుతున్నాడు. తనదైన షాట్లతో మునుపటి ధోనీని గుర్తుచేస్తున్నాడు. ధనాధన్ షాట్లతో మైదానంలోని ప్రేక్షకులను అలరిస్తున్నాడు. దాంతో సీఎస్‌కే మ్యాచ్‌ అంటే అందరి కళ్లు ధోనీ మీదే ఉంటున్నాయి. కెమెరామెన్‌లు సైతం మహీకి సంబంధించిన ప్రతీ మూమెంట్‌ను బంధించడానికి రెడీగా ఉంటున్నారు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా ధోనీపై కెమెరామెన్‌లు ఇంకాస్త ఎక్కువే ఫోకస్‌ చేశారు. దాంతో మిస్టర్‌ కూల్‌ కెమెరామెన్‌కు సైగలు చేస్తూ హెచ్చరించాడు.

చెపాక్‌ మైదనంలో టాస్‌ ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్‌ చేసింది. రుతురాజ్‌ గైక్వాడ్‌, శివం దూబే బ్యాటింగ్ చేస్తుండగా.. ఎంఎస్ ధోనీ డ్రెసింగ్‌ రూంలో ఉన్నాడు. మ్యాచ్ చూస్తున్న ధోనీ తన హెయిర్‌ సెట్‌ చేసుకుంటుండగా.. కెమెరామెన్‌ క్యాప్చర్‌ చేశాడు. దీంతో కాస్త అసహనానికి గురైన మహీ.. బాటిల్‌ చూపిస్తూ కొట్టేస్తా నిన్ను అంటూ కెమెరామెన్‌ను బెదిరించాడు. మ్యాచ్ చూపించకుండా.. నన్ను కవర్ చేస్తావేంటి? అన్నట్లుగా ఓ చూపు చూశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read: David Warner: ఉచిత ఆధార్‌ కార్డ్‌ కోసం పరుగులు తీసిన డేవిడ్‌ వార్నర్‌.. వీడియో చూస్తే నవ్వాగదు!

ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ ఒకే ఒక్క బంతి ఎదుర్కొని.. ఫోర్‌ బాదాడు. దాంతో చెపాక్ మైదనంను అభిమానులు తమ కేకలతో హోరెత్తించారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ.. 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి హ్యాట్రిక్‌ సిక్సర్లు బాదాడు. గతేడాది కెప్టెన్సీతో ఆకట్టుకున్న మహీ.. ఈ సీజన్లో బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు.