Site icon NTV Telugu

MS Dhoni Retirement: సీఎస్కే అభిమానులకు షాక్.. ఎంఎస్ ధోని రిటైర్మెంట్..

Dhoni

Dhoni

MS Dhoni Retirement: టీమిండియా మాజీ కెప్టెన్, సీఎస్కే ఆటగాడు ఎంఎస్ ధోనీ భవిష్యత్తుపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ 2026 సీజన్ ధోనీకి చివరి సీజన్ అవుతుందని తెలిపారు. 44 ఏళ్ల ధోనీ ఈ సీజన్ ముగిసిన తర్వాత ఆటకు వీడ్కోలు పలికి, జట్టులో మెంటర్ పాత్రలో కొనసాగేందుకు సిద్ధమవుతున్నారని చెప్పుకొచ్చాడు. కాగా, ఇటీవలి కాలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో భారీ మార్పులు చేసింది. అనుభవజ్ఞులైన ఆటగాళ్లను కాదని, యువ, అన్ క్యాప్డ్ ప్లేయర్స్ పై ఎక్కువగా దృష్టి పెట్టింది. గత సీజన్ చివర్లో డెవాల్డ్ బ్రెవిస్, ఆయుష్ మాత్రే, ఉర్విల్ పటేల్ వంటి యువ ఆటగాళ్లు అద్భుతంగా ఆడటమే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు.

Read Also: AP High Court: ఇంతకీ హిడ్మా ఎవరు? హైకోర్టు ప్రశ్న!

అయితే, అబుదాబీలో జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో CSK తన వ్యూహాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆల్‌రౌండర్ ప్రషాంత్ వీర్‌ను, వికెట్‌కీపర్- బ్యాటర్ కార్తీక్ శర్మను రూ.14.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఇద్దరూ ఐపీఎల్ వేలం చరిత్రలోనే అత్యంత ఖరీదైన అన్‌క్యాప్‌డ్ దేశీయ ఆటగాళ్లుగా రికార్డు సృష్టించారు. మొత్తం రూ.41 కోట్లతో తొమ్మిది మంది ప్లేయర్స్ ను కొనుగోలు చేసిన CSK, అందులో రూ.28.4 కోట్లను కేవలం ఈ ఇద్దరు యువ ఆటగాళ్లకే ఖర్చు చేయడం గమనార్హం.

Read Also: Telangana Thalli Statue : తెలంగాణ తల్లి విగ్రహంపై దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన ఆర్అండ్‌బీ శాఖ

ఇక, ఎంఎస్ ధోనీ ఇప్పటికీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తూ.. వికెట్‌కీపర్‌గా జట్టుకు సేవలందిస్తున్నారు. గత సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్ గాయపడటంతో మధ్యలోనే మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే, జట్టులో యువ ఆటగాళ్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం చూస్తే, ధోనీ ఆటగాడిగా కాకుండా మెంటర్‌గా మారే దిశగా అడుగులు వేస్తున్నారని జియో హాట్‌స్టార్‌తో మాట్లాడిన రాబిన్ ఉతప్ప పేర్కొన్నారు. ఇక సందేహాలకు చోటు లేదు.. ఇదే ధోనీ చివరి ఐపీఎల్ సీజన్.. ఈ సీజన్‌తో ఆయన పూర్తిగా ఆటకు వీడ్కోలు పలకనున్నారని వెల్లడించారు. యువ ఆటగాళ్లపై CSK దృష్టి పెట్టిందని, గత ఏడాది నుంచి జట్టు తీసుకున్న నిర్ణయాలను చూస్తుంటే అర్థమవుతుందని తెలిపాడు.

Read Also: Gold Silver Rates: చుక్కలు చూపిస్తున్న వెండి ధరలు.. ఇవాళ ఒక్కరోజే రూ.11 వేలు పెరిగిన సిల్వర్

కాగా, మినీ వేలానికి ముందు రవీంద్ర జడేజాను రాజస్థాన్ రాయల్స్‌కు ట్రేడ్ చేసి, సర్ఫరాజ్ ఖాన్, రాహుల్ చాహర్ వంటి ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడం కూడా ఇదే వ్యూహానికి నిదర్శనమని రాబిన్ ఉతప్ప పేర్కొన్నారు. ధోనీ లాంటి మెంటర్ ఉంటే మరో జడేజాను తయారు చేయడం అసాధ్యం కాదు.. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీతో పాటు ధోనీ మార్గదర్శకత్వం ఉంటే, CSK సరైన దిశలో ముందుకు వెళ్తుందన్నారు. ధోనీ ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత కూడా CSKతో అనుబంధం కొనసాగిస్తారనే విషయంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఈ సీజన్‌లో ధోనీ మెంటర్-కమ్-ప్లేయర్ పాత్రలో కనించనున్నారు. ఇప్పటికే ఆయన ఆ దృష్టితోనే ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది.. గత ఐదు సీజన్లుగా ధోనీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు కొనసాగుతున్నప్పటికీ, అభిమానులకు సరైన వీడ్కోలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఇంకా కొనసాగుతున్నారని మాజీ క్రికెటర్ ఉతప్ప వెల్లడించారు.

Exit mobile version