MS Dhoni IPL Retirement: ఇదే చివరి సీజనా..? ఐపీఎల్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన ధోనీ.. వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MS Dhoni IPL Retirement: ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు క్రికెట్ అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ తన రిటైర్మెంట్పై సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆదివారం చెన్నైలోని చిదంబరం స్టేడయంలో నిర్వహించిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానుల కార్యక్రమంలో ఎంఎస్ ధోనీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ, ప్రస్తుత సీఎస్కే ఆటగాళ్లు కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రముఖ నటుడు శివ కార్తికేయన్ సరదాగా ధోనీని రిటైర్మెంట్ గురించి అడుగుతూ, ఇంకా చాలా కాలం ఆడాలని కోరారు. దీనికి స్పందించిన ధోనీ నవ్వుతూ, “నేను 60 ఏళ్ల వరకు ఆడగలను.. కానీ, అది కష్టమే, అయినా ప్రయత్నిస్తాను” అని చెప్పాడు. ఈ వ్యాఖ్యతో స్టేడియంలో ఉన్న వేలాది మంది అభిమానులు “ధోనీ… ధోనీ…” అంటూ నినాదాలు చేస్తూ ఆనందంలో మునిగిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయింది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ధోనీ ఐపీఎల్ కెరీర్
* ఎంఎస్ ధోనీ ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకరు: 278 మ్యాచ్‌లు ఆడిన ఆయన.. 5,439 పరుగులు చేశారు.. చెన్నై సూపర్ కింగ్స్‌ను 5 సార్లు ఛాంపియన్‌గా నిలిపారు.. అతను ఐపీఎల్ 2026లో తన 19వ సీజన్ ఆడనున్నాడు.
జట్టులో ధోనీ పాత్రలో మార్పులు:
ఇటీవలి సీజన్లలో ధోనీ పాత్రలో కొన్ని కీలక మార్పులు కనిపిస్తున్నాయి.. కెప్టెన్సీని వదిలి రుతురాజ్ గైక్వాడ్ కు బాధ్యతలు అప్పగించారు.. బ్యాటింగ్ ఆర్డర్లో దిగువ స్థానంలో ఫినిషర్‌గా ఆడుతున్నారు.. ఇంపాక్ట్ ప్లేయర్ నియమం కారణంగా పరిమిత పాత్ర పోషిస్తోన్న విషయం విదితమే.. సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ ప్రకారం, ధోనీ 2026 సీజన్లో పూర్తి స్థాయిలో ఆడే అవకాశమున్నప్పటికీ, అతని పాత్రలో మార్పులు ఉండవచ్చు.
ఇదే చివరి సీజనా?
ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై ఇంకా స్పష్టత లేకపోయినా, ఐపీఎల్ 2026 అతని చివరి సీజన్ కావచ్చనే ఊహాగానాలు కొనసాగుతున్నాయి. గత సీజన్లో సీఎస్కే ప్రదర్శన నిరాశాజనకంగా ఉండటంతో, ఈసారి జట్టుకు ధోనీ అనుభవం చాలా కీలకం. మొత్తంగా ఐపీఎల్ 2026 సీఎస్కేకు కొత్త ఆరంభం కావచ్చు, అదే సమయంలో ధోనీ కెరీర్‌కు ముగింపు అధ్యాయం కూడా కావచ్చు. అయితే, అతను మైదానంలో ఉన్నంతకాలం అభిమానులకు మ్యాజిక్ చూపిస్తాడనే నమ్మకం మాత్రం మారదు.
60 ఏళ్ల వరకు ఆడడానికి ప్రయత్నిస్తా.. @msdhoni @IPL @ChennaiIPL #csk #IPL #IPL2026 #MSD #MSDHONI #WhistlePodu #Roar26 pic.twitter.com/Tdy1OSrJJm
— Ram kumar (@RAESC2828) March 23, 2026
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!