NTV Telugu Site icon

MS Dhoni Retirement: హార్ట్ బ్రేక్ న్యూస్.. ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ గుడ్‌బై!

Ms Dhoni Csk

Ms Dhoni Csk

Chennai Super Kings Star MS Dhoni IPL Retirement: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి ఎంఎస్ ధోనీ అభిమానులకు హార్ట్ బ్రేక్ న్యూస్. ఐపీఎల్ 17వ సీజన్ అనంతరం ఐపీఎల్‌కు ధోనీ గుడ్‌బై చెబుతాడని సమాచారం. చెపాక్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ అనంతరం మహీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఐపీఎల్ 2024లో చెన్నై ప్లేఆఫ్‌కు అర్హత సాధించకపోతే.. చెన్నైలో ధోనీ ఆడే చివరి మ్యాచ్ ఇదే అవుతుంది.

రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘చెన్నై, రాజస్థాన్ మ్యాచ్ అనంతరం సూపర్‌ సూపర్ ఫ్యాన్స్ మైదానాన్ని వీడొద్దని అభ్యర్థిస్తున్నాము. ఓ ప్రత్యేకమైన విషయం మీకు చెప్పాలి. అందరికీ ధన్యవాదాలు’ అని చెన్నై పేర్కొంది. ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఎంఎస్ ధోనీ నేడు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. చెన్నై ట్వీట్ చూసిన ఫాన్స్ చాలా నిరాశ చెందుతున్నారు. చెన్నై చెప్పేది ధోనీ రిటైర్మెంట్ విషయం కావొద్దని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు.

Also Read: Challenge Vote: మీ ఓటును వేరే వాళ్లు వేశారా?.. అయితే ఇలా చేయండి!

ఐపీఎల్ 2024 లీగ్ స్టేజ్ మ్యాచ్‌లు మే 19న ముగియనుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను మే 18న చిన్నస్వామి స్టేడియంలో ఆడనుంది. చెన్నై వేదికగా ఈరోజే ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడిస్తుంది. చెన్నైలో క్వాలిఫయిర్-2, ఫైనల్ మ్యాచ్‌ జరగనున్నాయి. అయితే చెన్నై ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించకపోతే.. నేడు సొంత మైదానంలో చివరి మ్యాచ్ కానుంది. అందుకే ఎంఎస్ ధోనీ తన రిటైర్మెంట్ విషయాన్ని చెపాక్ మైదానంలో సొంత అభిమానుల మధ్య నేరుగా చెప్పలని భావించినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఎవరికీ చెప్పకుండా రిటైర్మెంట్ ఇవ్వడం ధోనీకి కొత్తేమి కాదు. చెన్నైకి మహీ ఐదు టైటిల్స్ అందించిన విషయం తెగెలిసిందే. మెగా లీగ్‌లో 263 మ్యాచ్‌లు ఆడిన ధోనీ.. 5218 పరుగులు చేశాడు. ఇందులో 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.