MS Dhoni Gives Clarity on His Retirement: మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే చివరి సీజన్ అంటూ కొన్ని రోజుల నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే! అది నిజమేనన్నట్టు ధోనీ సైతం ఒక స్పీచ్‌లో సంకేతాలూ ఇచ్చాడు. అభిమానులు మైదానానికి తరలివస్తుండటాన్ని చూస్తుంటే.. తనకు వీడ్కోలు పలుకుతున్నట్టు ఉందని ఒక పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో అతడు కుండబద్దలు కొట్టాడు. దీంతో.. ధోనీకి ఇదే ఫైనల్ సీజన్ అని అందరూ దాదాపు డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే.. ఇక మనం ధోనీని నెక్ట్స్ సీజన్‌లో చూడమేమోనని ఫ్యాన్స్ ఆందోళన చెందడం మొదలుపెట్టారు. అయితే.. ఫ్యాన్స్ ఇప్పుడు ఆ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. తాను రిటైర్మెంట్ ఇవ్వడం లేదని ధోనీ చెప్పకనే చెప్పేశాడు. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం.
Flash Floods: రువాండాలో వరదల బీభత్సం.. 100 మందికి పైగా మృతి
బుధవారం లక్నోతో జరిగిన మ్యాచ్ సందర్భంగా.. టాస్ వేసిన తర్వాత కామెంటేటర్ ధోనీ రిటైర్మెంట్‌పై ఓ ప్రశ్న సంధించాడు. ‘మీ చివరి సీజన్‌ని మీరు ఆస్వాదిస్తున్నారా?’ అంటూ ప్రశ్నించాడు. అందుకు ధోనీ బదులిస్తూ.. ‘‘ఇది నా చివరి సీజన్ అని మీరు నిర్ణయించుకున్నారు, నేను కాదు’’ అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు. అప్పుడు కామెంటేటర్.. మైదానానికి వచ్చిన ధోనీ ఫ్యాన్స్‌ని చూపిస్తూ, ‘‘మహీ ఇప్పుడే రిటైర్మెంట్ ఇవ్వడం లేదు, వచ్చే ఏడాది కూడా ఆడేందుకు వస్తాడు’’ అని అన్నాడు. ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో జోష్ నింపడంతో.. మైదానాన్ని హోరెత్తించేశారు. ధోనీ ధోనీ అంటూ అరుపులతో ఆ గ్రౌండ్ మొత్తం ఒక్కసారిగా కిక్కిరిసిపోయింది. సోషల్ మీడియాలోనూ అభిమానులు ఈ వార్తపై సంతోషం వ్యక్తం చేశారు. రానున్న సీజన్‌లోనూ తమ అభిమాన ధోనీ ఆడటాన్ని చూడొచ్చంటూ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు.
Russia: రష్యా అధ్యక్షుడు పుతిన్ హత్యకు ఉక్రెయిన్ కుట్ర!.. డ్రోన్ దాడి వీడియో ఇదిగో..
కాగా.. గతేడాదిలోనూ ధోనీ రిటైర్మెంట్‌పై వార్తలు చక్కర్లు కొట్టాయి. పైగా.. ఆ సమయంలో అతడు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం, జడేజా సీఎస్కే నాయకత్వ బాధ్యలు తీసుకోవడంతో.. ధోనీకి గతేడాది చివరి సీజన్ అని అంతా అనుకున్నారు. కానీ.. ఆ వార్తలకు చెక్ పెడుతూ, ధోనీ మళ్లీ సీఎస్కే పగ్గాలు తీసుకున్నాడు. అంతేకాదు.. ఈ సీజన్‌లోనూ తన జట్టుని విజయవంతంగా నడిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే వచ్చిన తాజా రిటైర్మెంట్ వార్తలపై స్పందిస్తూ.. తాను వచ్చే ఏడాది కూడా ఆడతానంటూ పరోక్షంగా క్లారిటీ ఇచ్చేశాడు.
