Site icon NTV Telugu

MS Dhoni: యువ క్రికెటర్లకు ఎంఎస్ ధోనీ క్లాస్.. ఒత్తిడికి గురికావొద్దని వెల్లడి

Dhoni

Dhoni

MS Dhoni: ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా మంగళవారం చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ టీమ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 రన్స్ చేసింది. ఇక, ఆర్ఆర్ 17.1 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. మ్యాచ్‌ తర్వాత మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని యువ క్రికెటర్లకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.

Read Also: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావును ప్రొక్లయిమ్డ్ అఫెండర్ గా ప్రకటించనున్న పోలీసులు

ఈ సందర్భంగా.. మీ మీద అంచనాలు పెరిగినప్పుడు ఒత్తిడికి గురికావొద్దని ఎంఎస్ ధోనీ తెలిపారు. సీనియర్‌ ప్లేయర్స్, కోచింగ్‌ స్టాఫ్ నుంచి అన్ని విషయాలను నేర్చుకోండి.. యువ ఆటగాళ్లు 200 ప్లస్‌ స్ట్రైక్‌రేట్‌తో రన్స్ చేయాలనుకున్నప్పుడు, బ్యాటింగ్‌లో నిలకడ కొనసాగించడం కష్టం.. అయినా మ్యాచ్‌లో ఏ దశలో అయినా సిక్స్‌లు కొట్టగల సామర్థ్యం వారు సొంతం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. అలాగే, మ్యాచ్‌లో తమ జట్టు ప్రదర్శన గురించి కూడా ధోనీ మాట్లాడుతూ.. మేం ప్రత్యర్థి జట్టు ముందు మంచి టార్గెట్ పెట్టాం.. కానీ మ్యాచ్‌ ప్రారంభంలో త్వరగా వికెట్లు కోల్పోవడంతో లోయర్‌, మిడిల్‌ ఆర్డర్‌పై ఒత్తిడి పెరిగిందన్నారు. బ్రెవిస్‌ మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు.. అతడు బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు రన్‌రేట్‌ చాలా చక్కగా ఉందన్నాడు. ఇక, పేసర్‌ కాంబోజ్‌ మంచిగా బౌలింగ్‌ చేశాడు అని ఎంఎస్‌ ధోనీ వివరించాడు.

Exit mobile version