Mohit Sharma Record: సన్‌రైజర్స్ బౌలర్ రికార్డు బద్దలు.. ఐపీఎల్‌లో మోహిత్ శర్మ చెత్త రికార్డు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohit Sharma gave 73 runs in 4 overs in IPL: గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఒక ఐపీఎల్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. బుధవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మోహిత్ తన కోటా 4 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 73 పరుగులు ఇచ్చాడు. దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ బాసిల్ థంపి రికార్డు బద్దలైంది. 2018లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో థంపి 4 ఓవర్లలో వికెట్ తీయకుండా 70 పరుగులు సమర్పించుకున్నాడు.
ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ముందు వరకు మోహిత్ శర్మ పర్వాలేదనిపించాడు. ఢిల్లీ మ్యాచ్‌లోనే అతడు తడబడ్డాడు. తన మొదటి ఓవర్లో (ఢిల్లీ ఇన్నింగ్స్ 12వ ఓవర్) రిషబ్ పంత్ రెండు ఫోర్లు బాది 12 పరుగులు పిండుకున్నాడు. రెండో ఓవర్లో (16వ ఓవర్) పంత్ రెండు సిక్సులు బాదడంతో 16 రన్స్ ఇచ్చాడు. తన మూడో ఓవర్లో 14 రన్స్ ఇచ్చిన మోహిత్.. నాలుగో ఓవర్లో ఏకంగా 31 పరుగులు సమర్పించుకున్నాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో పంత్ దాటికి వరుసగా 2, Wd, 6, 4, 6, 6, 6 పరుగులు ఇచ్చాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 224 రన్స్ చేసినా.. కేవలం 4 పరుగుల తేడాతో మాత్రమే గెలిచింది. ఛేదనలో గుజరాత్ టైటాన్స్ 220 రన్స్ చేసింది. మోహిత్ శర్మ అన్ని రన్స్ ఇవ్వకుంటే గుజరాత్ సునాయాసంగా గెలిచేదే. భారీగా పరుగులు ఇచ్చిన మోహిత్ పేరు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌ల్లో 10 వికెట్స్ తీసిన మోహిత్.. ఓవర్‌కు 10.35 చొప్పున రన్స్ ఇచ్చాడు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!