NTV Telugu Site icon

MI vs SRH: ముంబైతో మ్యాచ్.. హైదరాబాద్‌ ప్లేఆఫ్స్ ఛాన్స్‌కు ఎసరు వచ్చేనా?

Srh Ipl 2024

Srh Ipl 2024

Sunrisers Hyderabad Playoffs Chances in IPL 2024: ఐపీఎల్ 2024లో భాగంగా మరికొద్ది గంటల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో సోమవారం రాత్రి 7.30కు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ ముంబై కంటే హైదరాబాద్‌కు చాలా కీలకం. ఎందుకంటే ఇప్పటికే ముంబై ప్లేఆఫ్స్ అవకాశాలు కోల్పోగా.. హైదరాబాద్‌ పోటీలో ఉంది. ఈ నేపథ్యంలో ముంబై మ్యాచ్‌లో ఓడితే సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతాయి.

ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్‌ 10 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలను నమోదు చేసింది. 12 పాయింట్లతో ఇప్పుడు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం రెండు గెలిచినా.. కమిన్స్ సేన ప్లేఆఫ్స్‌ చేరుతుంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ మ్యాచ్‌ కీలకంగా మారింది. దెబ్బతిన్న పులిలా హార్దిక సేన రెచ్చిపోయే అవకాశం ఉంది. ఎలాగూ ప్లేఆఫ్స్‌ అవకాశాలు లేవు కాబట్టి స్వేచ్ఛగా ఆడనుంది. మరోవైపు ఫామ్ మీదున్న లక్నో, పంజాబ్‌లతో హైదరాబాద్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. గుజరాత్ కూడా పటిష్టంగానే ఉంది. దాంతో ఈరోజు ముంబైపై గెలిస్తే ప్లేఆఫ్స్‌కు సన్‌రైజర్స్ మరింత చెరువవుతుంది. ఒకవేళ ఓడితే ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతాయి.

Also Read: MS Dhoni: ఎంఎస్ ధోనీ ఆడకపోవడమే మంచిది.. హర్భజన్ సింగ్ ఫైర్!

సన్‌రైజర్స్ హైదరాబాద్‌, ముంబై ఇండియన్స్ జట్లు 22 మ్యాచుల్లో తలపడ్డాయి. ముంబై 12, హైదరాబాద్‌ 10 మ్యాచుల్లో గెలిచాయి. వాంఖడేలో ముంబైదే ఆధిపత్యం. ఇది కూడా హైదరాబాద్‌కు ప్రతికూలంగా ఉంది. వాంఖడే పిచ్‌లో బ్యాటర్లకు పెద్దగా సహకారం లభించదు. బౌండరీలు చిన్నగా ఉన్నా.. బ్యాటర్లు కష్టపడాల్సి ఉంటుంది. గత మ్యాచ్‌ ఫలితాన్ని చూస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టే విజయం సాధించింది. 170 పరుగుల టార్గెట్‌ను కూడా ముంబై ఛేదించలేకపోయింది. దాంతో టాస్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

Show comments