MI vs SRH: కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ 174!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. భారీ స్కోర్ సాదిస్తుందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ (48) టాప్ స్కోరర్. ఇన్నింగ్స్ చివర్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (35; 17 బంతుల్లో 2×4, 2×6) మెరుపులు మెరిపించడంతో సన్‌రైజర్స్ పోరాడే స్కోర్ చేసింది. ముంబై బౌలర్లలో పీయూష్ చావ్లా, హార్దిక్ పాండ్యా చెరో 3 వికెట్లు పడగొట్టారు.
ముంబై గడ్డపై సన్‌రైజర్స్ బ్యాటర్లు తేలిపోయారు. బౌలింగ్‌కు అనుకూలించిన వాంఖడే పిచ్‌పై దంచలేక.. వరుసగా డగౌట్‌కు క్యూ కట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు శుభారంభం దక్కలేదు. పవర్ ప్లేలో ఓపెనర్ అభిషేక్ శర్మ(11)ను జస్ప్రీత్ బుమ్రా ఔట్ చేశాడు. మయాంక్ అగర్వాల్ (5)ను అరంగేట్ర ఆటగాడు కంబోజీ బౌల్డ్ చేశాడు. దాంతో హైదరాబాద్ స్కోర్ వేగం తగ్గింది. ట్రావిస్ హెడ్, నితీశ్ కుమార్ (20)లు ధాటిగా ఆడే ప్రయత్నం చేశారు. అయితే ఈ జోడిని హార్దిక్ పాండ్యా విడదీశాడు.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read: Preity Zinta: ఎంఎస్ ధోనీ సిక్స్‌లు కొట్టలేదు.. పంజాబ్ గెలువలేదు: ప్రీతి జింతా
కాసేపటికే పీయుష్ చావ్లా సూపర్ బ్రేక్ ఇచ్చాడు. డేంజరస్ ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ (2)లను అతడు అవుట్ చేశాడు. దాంతో వంద లోపే ఐదు కీలక వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్.. కష్టాల్లో పడింది. షహ్‌బాజ్ అహ్మద్ (10), మార్కో జాన్‌సెన్ (17)లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే హార్దిక్ ఒకే ఓవర్లో ఈ ఇద్దరిని వెనక్కి పంపాడు. ఈ సమయంలో కమిన్స్ చెలరేగాడు. తుషార వేసిన 20వ ఓవర్లో సిక్సర్, ఫోర్ బాదాడు. దాంతో వాంఖడేలో హైదరాబాద్ పోరాడగలిగే స్కోర్ చేయగలిగింది.
తాజావార్తలు
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
RC17 – Rukmini Vasanth: చరణ్ – సుకుమార్ సినిమాలో కాంతర హీరోయిన్!
-
Ajinkya Rahane: ఎంఎస్ ధోనీ రూమ్‌కు రూల్.. తలుపు మూసి ఉంటే అంతే సంగతులు!
-
Dorothy Official Teaser : ‘డొరోతి’ టైటిల్ టీజర్.. దటీజ్ కార్తీక్ సుబ్బరాజ్
-
Engineering College fees: “అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు”.. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
ట్రెండింగ్
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!