MI vs SRH: వాంఖడే చరిత్రలోనే ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు.. కన్నీరు పెట్టిన నీతా అంబానీ!
- మరీ దారుణంగా ముంబై ఇండియన్స్ పరిస్థితి
- వాంఖడేలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై పరాజయం
- కన్నీరు పెట్టిన నీతా అంబానీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్‌లో ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (ఎంఐ) పరిస్థితి మరీ దారుణంగా మారింది. బుధవారం వాంఖడేలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్)పై పరాజయం అనంతరం ఎంఐ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. భారీ స్కోర్ చేసినా విజయం దూరమైంది. సొంత మైదానం వాంఖడేలో వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోవడం ముంబై చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ పరాజయాల పరంపర అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్స్ మ్యాచ్ అనంతరం ఎంఐ ఓనర్ నీతా అంబానీ భావోద్వేగానికి లోనయ్యారు. జట్టు ఓటమితో తీవ్ర నిరాశకు గురైన నీతా.. డగౌట్‌లో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జట్టు ప్రదర్శనపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అకాశ్ అంబానీ తీసుకున్న నిర్ణయాలపై కూడా సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ప్రదర్శన చూస్తే ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపుగా ముగిసినట్లే. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌లలో కేవలం 2 విజయాలే సాధించిన ముంబై.. 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ఇక ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగిలిన 6 మ్యాచ్‌లన్నింటిలో గెలవాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుత ఫామ్ దృష్ట్యా అది అంత సులభం కాదనే చెప్పొచ్చు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ ముంబై విఫలమవుతోంది. స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ జట్టు సమష్టిగా రాణించలేకపోతోంది. ముఖ్యంగా కీలక సమయంలో వికెట్లు కోల్పోవడం, బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడం జట్టుకు ప్రధాన సమస్యగా మారింది. ముంబై ఇండియన్స్‌కు ఇది అత్యంత కఠినమైన సీజన్‌గా మారింది. ఇకపై జరిగే మ్యాచ్‌లలో తిరిగి పుంజుకుని అభిమానులకు సంతోషం కలిగిస్తుందా? లేదా ఈ సీజన్‌ను నిరాశతో ముగిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!