Site icon NTV Telugu

MI vs SRH: బౌలింగ్ ఎంచుకున్న ముంబై.. కాంభోజ్ అరంగేట్రం! తుది జట్లు ఇవే

Mi Vs Srh 2024

Mi Vs Srh 2024

MI vs SRH Playing 11: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు మరికాసేపట్లో తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7.30కు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. ముంబై తరఫున అన్షుల్ కాంభోజ్ అరంగేట్రం చేశాడు. మరోవైపు హైదరాబాద్ తరఫున మయాంక్ అగర్వాల్ తుది జట్టులోకి వచ్చాడు. ఫ‌స్ట్ బ్యాటింగ్ అంటే రెచ్చిపోయే స‌న్‌రైజ‌ర్స్ ప్లేయర్స్ మ‌రోసారి 250 ప్ల‌స్ కొడ‌తారా? లేదో? చూడాలి.

ఉప్ప‌ల్ స్టేడియంలో ముంబై బౌల‌ర్ల‌పై స‌న్‌రైజ‌ర్స్ ప్లేయర్స్ ఏ రేంజ్‌లో చెలరేగారో చూశాం. హెడ్, అభిషేక్, క్లాసెన్ పరుగుల వరద పారించడంతో ఐపీఎల్ రికార్డు బ‌ద్ధ‌లైపోయింది. ఈరోజు సన్‌రైజ‌ర్స్ బ్యాటర్లు వాంఖ‌డేలో త‌మ త‌డాఖా చూపేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌పై ఒక్క ప‌రుగు తేడాతో విజ‌యం సాధించిన హైదరాబాద్.. ప్లే ఆఫ్స్ అవ‌కాశాలను స‌జీవంగా ఉంచుకుంది. మ‌రోవైపు కోల్‌క‌తా చేతిలో ఓట‌మితో ముంబై ఇప్ప‌టికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైతప్పుకుంది.

Also Read: Team India New Jersey: టీ20 ప్రపంచకప్ కోసం కొత్త జెర్సీ.. స్టోర్‌, ఆన్‌లైన్‌లో లభ్యం!

తుది జట్లు:
హైద‌రాబాద్: అభిషేక్ శ‌ర్మ‌, ట్రావిస్ హెడ్, మ‌యాంక్ అగ‌ర్వాల్, నితిశ్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ స‌మ‌ద్, ష‌హ్‌బాజ్ అహ్మ‌ద్, మార్కో జాన్‌సెన్, ప్యాట్ క‌మిన్స్ (కెప్టెన్‌), భువ‌నేశ్వ‌ర్, టి న‌ట‌రాజ‌న్.
ముంబై: రోహిత్ శ‌ర్మ, ఇషాన్ కిష‌న్ (వికెట్ కీప‌ర్), న‌మాన్ ధార్, సూర్య‌కుమార్ యాద‌వ్, తిల‌క్ వ‌ర్మ‌, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, అన్షుల్ కంబోలి, పీయూష్ చావ్లా, జ‌స్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార‌.

Exit mobile version