Mumbai Indians unwanted record in IPL: ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ చివరి మ్యాచ్ ఆడేసింది. శుక్రవారం రాత్రి వాంఖడే మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ సేన.. కేవలం నాలుగు మ్యాచ్‌లే గెలిచింది. ఏకంగా 10 మ్యాచ్‌లలో ఓడి.. పాయింట్ల పట్టికలో పదో స్థానంతో ఐపీఎల్ 2024ను ముగించింది. బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యమే కాకుండా.. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ కూడా జట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.
ఐపీఎల్ 2024లో 10 ఓటములతో ముంబై ఇండియన్స్ సహా హార్దిక్ పాండ్యా ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది. ఓ ఐపీఎల్ సీజన్‌లో 10 మ్యాచ్‌ల్లో ఓడిపోవడం ముంబైకు ఇది రెండోసారి. 2022 సీజన్‌లో రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై 10 మ్యాచ్‌ల్లో ఓడింది. ఇప్పుడు ఆ రికార్డును హార్దిక్ సమం చేశాడు. ఓ సీజన్‌లో అత్యధిక ఓటములు చవిచూసిన ముంబై సారథులుగా రోహిత్, హార్దిక్ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు.
Also Read: IPL 2024: ఇక మా మామ టీమ్‌కు వెళ్తున్నా: కేఎల్ రాహుల్
ముంబై ఇండియన్స్ చివరగా ఐపీఎల్ 2020లో ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో చెన్నైపై ఒక్క పరుగు తేడాతో గెలిచింది. 2020 తర్వాత ముంబై టీమ్ వరుసగా నిరాశపరుస్తోంది. 2021, 2022లో లీగ్ స్టేజ్‌లోనే నిష్క్రమించిన ముంబై.. 2023లో ప్లేఆఫ్స్‌కు వెళ్లింది. అయితే ఫైనల్‌కు మాత్రం చేరుకోలేదు. దీంతో రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలను అంబానీ ఫామిలీ అప్పగించింది. అయినా ముంబై రాత మారలేదు.