NTV Telugu Site icon

MS Dhoni Sixes: ఎంఎస్ ధోనీ హ్యాట్రిక్‌ సిక్స్‌లు.. దద్దరిల్లిన వాంఖడే స్టేడియం! వీడియో వైరల్

Ms Dhoni Sixes

Ms Dhoni Sixes

MS Dhoni Hat-Trick Sixes Video Goes Viral: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అదరగొడుతున్నాడు. తనదైన షాట్లతో మునుపటి ధోనీని గుర్తుచేస్తున్నాడు. ధనాధన్ షాట్లతో మైదానంలోని ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవల విశాఖలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ.. 16 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌పై మహీ మరోసారి చెలరేగాడు.

ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ చివరి ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి హ్యాట్రిక్‌ సిక్సర్లు బాదాడు. 20వ ఓవర్‌లోని 3, 4, 5 బంతులకు భారీ సిక్సర్లు కొట్టాడు. ధోనీ సిక్స్‌లతో స్టేడియం దద్దరిల్లింది. చెన్నై సూపర్ కింగ్స్ ఫాన్స్ మాత్రమే కాదు.. ముంబై ఫాన్స్ కూడా ఎంజాయ్ చేశారు. బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ కూడా మహీ భారీ సిక్సర్లను ఎంజాయ్ చేశారు. ధోనీ హ్యాట్రిక్‌ సిక్స్‌లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Also Read: Hardik Pandya: స్టంప్స్‌ వెనుక మాస్టర్‌ మైండ్‌ ఉంది: హార్దిక్

ఎంఎస్ ధోనీ కేవలం 4 బంతుల్లోనే 3 సిక్సర్ల సాయంతో 20 పరుగులు చేశాడు. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ స్కోర్‌ 200 పరుగులు దాటింది. మహీ ఆడిన ఇన్నింగ్సే ముంబై ఇండియన్స్‌ కొంపముంచింది. సరిగ్గా ధోనీ చేసిన ఆ 20 పరుగులే ముంబై ఓటమికి కారణమయ్యాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులకే పరిమితమైంది.

Show comments