ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో సీఎస్కే కెప్టెన్ (108*)సెంచరీతో చెలరేగాడు. 60 బంతుల్లో 80 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 3 సిక్సులు, 12 ఫోర్లు ఉన్నాయి. గైక్వాడ్ కు ఐపీఎల్ కెరీర్‌లో ఇది రెండో సెంచరీ. మరో బ్యాటర్ శివం దూబె శివాలెత్తించాడు. అతను కూడా 66 పరుగులు సాధించాడు. దూబే తన తొమ్మిదో అర్ధ సెంచరీని నమోదు చేశాడు. దీంతో చెన్నై భారీ స్కోరు చేసింది.
Read Also: Lok sabha election: 4 రాష్ట్రాలకు హీట్ వేవ్ ఎఫెక్ట్.. 26న పోలింగ్ తగ్గనుందా?
సీఎస్కే బ్యాటింగ్ లో అజింక్యా రహానే (1) నిరాశపరిచాడు. మిచెల్ (11), జడేజా (16), ధోనీ (4) పరుగులు చేశారు. లక్నో బౌలింగ్ లో మ్యాట్ హెన్రీ, మోసిన్ ఖాన్, యష్ ఠాకూర్ తలో వికెట్ సంపాదించారు.