Site icon NTV Telugu

LSG vs PBKS: పంజాబ్ పై లక్నో సూపర్ విక్టరీ..

Luknow

Luknow

ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్- పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 199 పరుగులు చేసి పంజాబ్ ముందు 200 పరుగుల టార్గెట్ ను ఉంచారు. ఈ క్రమంలో లక్ష్యచేధనలో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. దీంతో.. లక్నో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Kakarla Suresh: టీడీపీ ప్రభుత్వంలోనే అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి..

పంజాబ్ బ్యాటింగ్ లో ఓపెనర్లు శిఖర్ ధావన్ (70), బెయిర్ స్టో (42) పరుగులతో రాణించారు. ఒకానొక దశలో 100 పరుగులు చేసినా.. వికెట్ నష్టపోలేదు. కానీ లక్నో బౌలర్ మయాంక్ యాదవ్ (3 వికెట్లు) దెబ్బకు పంజాబ్ కింగ్స్ ఒక్కసారిగా పడిపోయింది. ప్రభుమాన్ సింగ్ (19), జితేష్ శర్మ (6), లివింగ్ స్టోన్ (28) పరుగులు చేశారు. సామ్ కరన్ డకౌట్ అయ్యాడు. మరోవైపు లక్నో బౌలింగ్ లో మోషిన్ ఖాన్ కూడా రెండు కీలక వికెట్లు తీయడంతో మ్యాచ్ లక్నో వైపు తిరిగింది.

Off The Record : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎక్కడ..?

అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన లక్నో.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటింగ్ లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన క్వింటాన్ డికాక్ (54) అర్ధసెంచరీతో రాణించాడు. కేఎల్ రాహుల్ (15) పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన పడిక్కల్ (9), స్టోయినీస్ (19) పరుగులు చేయగా.. కెప్టెన్ నికోలస్ పూరన్ (42) పరుగులతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత ఆయూష్ బదోని (8), చివరలో కృనాల్ పాండ్యా (43) పరుగులు చేసి జట్టు స్కోరును పెంచాడు. ఇక.. పంజాబ్ బౌలింగ్ లో సామ్ కరన్ 3 వికెట్లతో చెలరేగాడు. అర్ష్దీప్సింగ్ కు రెండు వికెట్లు దక్కాయి. రబాడా, రాహుల్ చాహర్ తలో వికెట్ సంపాదించారు.

Exit mobile version