Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ipl Lucknow Super Giants Scored 63 Runs In First 10 Overs

RCB vs LSG: కష్టాల్లో లక్నో జట్టు.. ఉత్కంఠభరితంగా మారిన మ్యాచ్

Published Date :May 1, 2023 , 10:55 pm
By NTV WebDesk
RCB vs LSG: కష్టాల్లో లక్నో జట్టు.. ఉత్కంఠభరితంగా మారిన మ్యాచ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Lucknow Super Giants Scored 63 Runs In First 10 Overs: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన 127 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కష్టాల్లో ఉంది. 10 ఓవర్లు ముగిసే సమయానికి లక్నో జట్టు 5 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేధించాలంటే.. మరో 10 ఓవర్లలో 64 పరుగులు చేయాల్సి ఉంటుంది. లక్ష్యం చిన్నదే అయినా.. ఐదు వికెట్లు పోయాయి కాబట్టి, ఆచితూచి ఆడాలి. వికెట్లు పడకుండా, జాగ్రత్తగా రాణించాలి. నిజానికి.. స్వల్ప లక్ష్యంతో లక్నో బరిలోకి దిగింది కాబట్టి, మ్యాచ్ వన్ సైడెడ్‌గా సాగుతుందని అందరూ అనుకున్నారు. పైగా ఇది లక్నోకి హోమ్‌గ్రౌండ్ కావడంతో, ఆడుతూ పాడుతూ లక్నో మ్యాచ్ ముగించేస్తుందని భావించారు. కానీ.. అందుకు భిన్నంగా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. పవర్ ప్లేలోనే లక్నో జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. పూరన్ వచ్చి రాగానే సిక్స్ కొట్టడంతో.. అతడు మెరుపు ఇన్నింగ్స్‌తో మ్యాచ్ ముగిస్తాడనే అంచనాలు ఏర్పడ్డాయి. కానీ.. అతడు భారీ షాట్ కొట్టబోయి, వెంటనే పెవిలియన్ చేరాడు.

Ipl Ad

అంతకుముందు.. విధ్వంసకర ఆటగాడు కైల్ మేయర్స్ అయితే సున్నా పరుగులకే వెనుదిరిగాడు. రెండో బంతికి అతడు షాట్ కొట్టబోగా.. అది 30 సర్కిల్ యార్డ్స్‌లో ఉన్న అనుజ్ రావత్ చేతిలోకి నేరుగా వెళ్లింది. ఆ తర్వాత వచ్చిన కృనాల్ పాండ్యా.. మొదట్లో నిదానంగా తన ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినా, ఆ తర్వాత సిరాజ్ బౌలింగ్‌లో మెరుపులు మెరిపించాడు. హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. కానీ.. ఆ ఊపులోనే అతడు మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అయుష్ బదోని సైతం ఆ వెంటనే పెవిలియన్ బాట పట్టాడు. ఇక దీపక్ హుడా మరోసారి నిరాశపరిచాడు. ఇలా క్రీజులోకి అడుగుపెట్టినట్టే పెట్టి, అలా ఔటై వెళ్లిపోయాడు. చూస్తుంటే.. ఈ మ్యాచ్ చివరి ఓవర్ వరకూ త్రిల్లింగ్‌గా సాగేలా కనిపిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Krishnappa Gowtham
  • lsg vs rcb
  • Lucknow Super Giants
  • Royal Challengers Bangalore
  • VIRAT KOHLI

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions