LSG vs MI : లక్నో సూపర్ జెయింట్స్ ముందు ఊరించే టార్గెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తుది దశకు చేరుకుంది. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో ఓడిన జట్టు ప్రస్తుత ఐపీఎల్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఫస్ట్ బ్యాటింగ్ కు వచ్చిన ముంబై టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అయితే ముంబై జట్టు ఆదిలోనే వరుసగా రెండు వికెట్లను కోల్పోయింది. ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ 11 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీంతో 30 పరుగులకే తొలి వికెట్ ను కోల్పోయింది.
Also Read : New Parliament: ఇది ప్రజాస్వామ్యానికి అవమానం.. విపక్షాల బహిష్కరణపై ఎన్డీయే ఆగ్రహం
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ధాటిగా ఆడుతున్నట్లు కనిపించిన మరో ఓపెనర్ ఇషాంత్ కిషన్ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. యశ్ ఠాకూర్ బౌలింగ్ లో నికోలస్ పూరన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 62 పరుగులకే కీలకమైన రెండు వికెట్లను ముంబై ఇండియన్స్ జట్టు కోల్పోయింది. ఇక క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్.. సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కలిసి భారీ షాట్స్ కొట్టడంతో 6 ఓవర్లు ముగిసే సరికే ముంబై స్కోర్ 62 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ జట్టు 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది.
Also Read : Suresh Raina: మరోసారి ధోని ఐపీఎల్ టైటిల్ గెలవాలని యావత్ భారత్ చూస్తోంది..
ఇక పదకొండవ ఓవర్ బౌలింగ్ కు వచ్చిన నవీన్ హుల్ హక్ అద్భుతమైన ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ ( 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ తో 33 పరుగులు), కామెరూన్ గ్రీన్ 23 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ తో 41 పరుగులు)లను అవుట్ చేసి ముంబై ఇండియన్స్ జట్టును కోలుకోని దెబ్బ కొట్టాడు. ముంబై ఇండియన్స్ 16 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి..141 పరుగులు చేసింది. ఇక ఐదో వికెట్ గా టిమ్ డేవిడ్ 13 పరుగులు చేసి యశ్ ఠాకూర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. 18 ఓవర్లో నవీన్ ఉల్ హక్ బౌలింగ్ లో తిలక్ వర్మ భారీ షాట్ ఆడబోయి దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. 19వ ఓవర్ వేసిన మోసిన్ ఖాన్ బౌలింగ్ లో లాంగ్ ఆఫ్ లో ఉన్న దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చి క్రిస్ జోర్దాన్ డగౌట్ కు వెళ్లాడు.
Also Read : Naveen Patnaik: విపక్షాలకు షాక్.. పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరవుతామన్న బీజేడీ..
ఇక చివర్లో నేహాల్ వధేరా అద్భుతమైన బ్యాటింగ్ తో ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ స్కోర్ ను అందించాడు. లాస్ట్ బాల్ కు యశ్ ఠాకూర్ బౌలింగ్ లో వధేరా ఔట్ కావడంతో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ టార్గెట్ 183 పరుగులు. ఇక లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 4 వికెట్లు, యశ్ ఠాకూర్ 3 వికెట్లు, మోసిన్ ఖాన్ ఒక్క వికెట్ తీసుకున్నాడు.

తాజావార్తలు
-
Air India: ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమాన పైలట్ డోప్ టెస్ట్‌లో ఫెయిల్? స్పందించిన ఎయిర్ ఇండియా
-
Operation Safed Sagar OTT: కార్గిల్ యుద్ధం చెప్పని కథ.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1గా దూసుకెళ్తున్న 6 ఎపిసోడ్ల సిరీస్..
-
Kriti Sanon : ఒకవైపు ఫ్యాషన్ ఐకాన్, మరోవైపు బిగ్-బడ్జెట్ సినిమాల క్వీన్
-
Korean Kanakaraju Day 2 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ దూకుడు.. 2 రోజుల్లోనే రూ.23.6 కోట్ల గ్రాస్!
-
Hyderabad Black Hawks: తెలుగు రాష్ట్రాల్లో వాలీబాల్‌కు కొత్త ఊపు.. హైదరాబాద్ బ్లాక్ హాక్స్ దీర్ఘకాలిక ప్రణాళిక
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!