NTV Telugu Site icon

CSK vs LSG: ఉత్కంఠపోరులో లక్నో విజయం.. సెంచరీతో ఆదుకున్న స్టోయినీస్

Lsg Won

Lsg Won

ఐపీఎల్ 2024లో భాగంగా.. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. 211 పరుగుల లక్ష్యాన్ని కేవలం 4 వికెట్లు కోల్పోయి చేధించింది. లక్నో బ్యాటింగ్ లో స్టోయినీస్ సెంచరీ సాధించడంతో లక్నో గెలుపొందింది. ఒకానొక సమయంలో మ్యాచ్ చెన్నై వైపు ఉన్నప్పటికీ.. సీఎస్కే బౌలర్లపై స్టోయినీస్ విరుచుకుపడ్డాడు. 63 బంతుల్లో 124 పరుగులు చేసి అజేయంగా మ్యాచ్ ను గెలిపించాడు. అతని ఇన్నింగ్స్ లో 6 సిక్సులు, 13 ఫోర్లు ఉన్నాయి.

Read Also: Raghurama Krishna Raju: అధికారంలోకి రాబోయేది ఎన్డీఏ కూటమే..

లక్నో బ్యాటింగ్ లో చివరలో దీపక్ హుడా కేవలం 6 బంతుల్లో 17 పరుగులు చేసి జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. కేఎల్ రాహుల్ (16), పడిక్కల్ (13), పూరన్ (34) పరుగులు చేశారు. చెన్నై బౌలింగ్ లో మతీషా పతిరాన 2 వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్, ముస్తాఫిజుర్ రహమన్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ (108*)సెంచరీ చేసినప్పటికీ వృధా అయిపోయింది. శివం దూబె (66) పరుగులు సాధించాడు. సీఎస్కే బ్యాటింగ్ లో అజింక్యా రహానే (1) నిరాశపరిచాడు. మిచెల్ (11), జడేజా (16), ధోనీ (4) పరుగులు చేశారు. లక్నో బౌలింగ్ లో మ్యాట్ హెన్రీ, మోసిన్ ఖాన్, యష్ ఠాకూర్ తలో వికెట్ సంపాదించారు.

Read Also: Ranveer Singh: డీప్‌ఫేక్ వీడియోపై రణవీర్ సింగ్ ఫిర్యాదు.. అప్‌డేట్ ఇదే!

Show comments