Mayank Yadav Ruled Out of IPL 2024: కీలక ప్లేఆఫ్స్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. యువ స్పీడ్‌స్టర్ మయాంక్ యాదవ్ మిగిలిన ఐపీఎల్ 2024కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని లక్నో చీఫ్ కోచ్ జస్టిన్ లాంగర్ శనివారం ధృవీకరించాడు. గతంలో గాయం అయిన చోటే అతడికి మరోసారి ఇంజ్యూరీ అయిందని లాంగర్ చెప్పాడు. మయాంక్ గ్రేడ్ 1 టియర్ (సైడ్ స్ట్రెయిన్)తో బాధపడుతున్నాడు.
ముందుగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డ మయాంక్ యాదవ్.. నాలుగు వారాల విశ్రాంతి తర్వాత ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ ఆడాడు. అయితే గాయం ఇబ్బంది పెట్టడంతో… తన ఓవర్ల కోటా పూర్తి కాకుండానే మైదానం వీడాడు. బీసీసీఐ పేస్ బౌలింగ్ కాంట్రాక్టు జాబితాలో చోటు దక్కించుకున్న మయాంక్.. బెంగళూరులోని ఎన్‌సీఏలో పునరావాసం పొందనున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశముంది. ప్లేఆఫ్స్ రేసులో ఉన్న లక్నోకు మయాంక్ గాయం భారీ ఎదురుదెబ్బ అని చెప్పాలి. లక్నో 10 మ్యాచ్‌లు ఆడి 6 విజయాలతో పట్టికలో మూడో స్థానంలో ఉంది.
Aslo Read: RCB vs GT: విరాట్ కోహ్లీ బుల్లెట్ త్రో.. షారూఖ్ ఖాన్ ఫ్యూజ్‌లు ఔట్!
21 ఏళ్ల మయాంక్ యాదవ్ ఐపీఎల్ 2024లో బుల్లెట్ లాంటి బంతులతో ప్రత్యర్థి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించాడు. గంటకు 150 కి.మీ వేగంతో బంతులు సందిస్తునాడు. బెంగళూరుపై ఒక బంతిని ఏకంగా 156.7 కి.మీ వేగంతో వేసి రికార్డు సృష్టించాడు. 2024 సీజన్‌లో ఇదే అత్యంత వేగవంతమైన బంతి. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా వేసిన బౌలర్ల జాబితాలో మయాంక్ టాప్ 4కి చేరుకున్నాడు. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన మయాంక్ ఏడు వికెట్లు పడగొట్టాడు.