NTV Telugu Site icon

LSG vs CSK: ఐపీఎల్‌ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా మార్కస్‌ స్టొయినిస్‌!

Marcus Stoinis Lsg

Marcus Stoinis Lsg

Marcus Stoinis is the highest-ever score in an IPL Chase: ఐపీఎల్‌ 2024లో భాగంగా మంగళవారం చెపాక్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ అద్భుత విజయం సాధించింది. 211 పరుగుల భారీ లక్ష్యాన్ని లక్నో 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్నో విజయంలో ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టొయినిస్‌ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 63 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్స్‌లతో 124 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సెంచరీ చేసిన స్టొయినిస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

అజేయ సెంచరీ చేసిన మార్కస్‌ స్టొయినిస్‌ 17 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఓ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్‌ చరిత్రలోనే విజయవంతమైన రన్‌ ఛేజింగ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాడు పాల్ వాల్తాటి పేరిట ఉంది. 2011లో చెన్నైపైనే లక్ష్య చేధనలో వాల్తాటి 120 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. తాజా మ్యాచ్‌లో 124 పరుగులు చేసిన స్టొయినిస్‌ వాల్తాటి రికార్డును బద్దలు కొట్టాడు.

Also Read: Sunitha Mahender Reddy: పండుగలతోనే ప్రజల మధ్య ఐక్యమత్యం: సునీత మహేందర్ రెడ్డి

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై 4 వికెట్లకు 210 పరుగులు చేసింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (108 నాటౌట్‌; 60 బంతుల్లో 12×4, 3×6) సెంచరీ చేయగా.. శివమ్‌ దూబె (66; 27 బంతుల్లో 3×4, 7×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 211 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మార్కస్‌ స్టాయినిస్‌ అజేయ శతకంతో చెలరేగగా.. నికోలస్ పూరన్‌ (34; 15 బంతుల్లో 3×4, 2×6) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

Show comments