Kolkata Knight Riders Scored 204 Against Royal Challengers Bangalore: ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 204 పరుగులు చేసింది. గుర్బాజ్ (57), రింకు సింగ్ (46), శార్దూల్ ఠాకూర్ (68) అద్భుతంగా రాణించడం వల్ల.. కేకేఆర్ ఇంత భారీ స్కోరు చేయగలిగింది. నిజానికి.. మొదట్లో కోల్‌కతా ఇన్నింగ్స్ చూసి, ఈ జట్టు కనీసం 160 పరుగుల మైలురాయిని అయినా అందుకుంటుందా? అనే అనుమానాలు రేకెత్తాయి. ఎందుకంటే.. గుర్బాజ్ మినహాయించి టాపార్డర్‌లో మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. తొలి పది ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి కేకేఆర్ కేవలం 79 పరుగులే చేసింది.
Budget Session: పార్లమెంట్ పని చేసింది 45 గంటలే.. ఉభయ సభలు నిరవధిక వాయిదా
అనంతరం గుర్బాజ్ ఔటయ్యాక విధ్వంసకర బ్యాటర్ రసెల్ కూడా అతని వెంటే పెవిలియన్ వెళ్లాడు. గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో.. కేకేఆర్ పని దాదాపు అయిపోయినట్లేనని అంతా అనుకున్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో శార్దూల్ ఠాకూర్ వచ్చి, ‘నేనున్నా’ అంటూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఓవైపు రింకు సింగిల్స్ చేస్తూ చేయూతనందిస్తుండగా.. శార్దూల్ దుమ్ముదులిపేశాడు. ఫోర్లు, సిక్సర్లతో మైదానంలో పరుగుల వర్షం కురిపించాడు. కేవలం 20 బంతుల్లో అర్థశతకం పూర్తి చేశాడంటే.. ఏ రేంజ్‌లో అతడు విజృంభించాడో అర్థం చేసుకోవచ్చు. బౌలర్లు ఎంత క్లిష్టమైన బంతులు వేసినా.. వాటిని తనకు అనుకూలంగా మార్చుకుని, బౌండరీ లైన్ దాటించేశాడు. కేకేఆర్ 200 పరుగుల మైల్‌స్టోన్‌ని దాటిందంటే.. అది శార్దూల్ పుణ్యమే! ఈ ఇన్నింగ్స్ చూశాక అతడ్ని లార్డ్ ఠాకూర్ అని ఎందుకంటారో మరోసారి నిరూపితమైంది. విశేషం ఏమిటంటే.. శార్దూల్‌కి ఐపీఎల్‌లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు.
Raviteja: కంచం ముందుకు, మంచం మీదకు ఆడపిల్లలు పిలవంగానే రావాలి.. లేకపోతే
శార్దూల్‌తో పాటు చివర్లో రింకు సైతం ఊపందుకున్నాడు. అప్పటిదాకా నిదానంగా ఆడిన అతగాడు.. బౌండరీలతో చెలరేగిపోయాడు. వీళ్లిద్దరు కలిసి ఆరో వికెట్‌కి ఏకంగా 103 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఇక లాస్ట్‌లో ఉమేశ్ యాదవ్ కూడా ఫోర్ బాదాడు. ఫలితంగా.. కేకేఆర్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేయగలిగింది. ఇక ఆర్సీబీ బౌలర్ల విషయానికొస్తే.. మొదటి పది ఓవర్లు కట్టుదిట్టంగానే వేశారు కానీ, ఆ తర్వాత పరుగులు బాగానే సమర్పించుకున్నారు. డేవిడ్, కరణ్ చెరో రెండు వికెట్లు తీసుకోగా.. సిరాజ్, బ్రేస్‌వెల్, హర్షల్ తలా వికెట్ పడగొట్టారు. మరి.. 205 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ఛేధిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ!
