NTV Telugu Site icon

Delhi Capitals: కేఎల్ రాహుల్ పునరాగమనం ఖాయం.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో జట్టులోకి

Kl Rahul

Kl Rahul

ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ తన తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో రాహుల్ జట్టులోకి చేరే అవకాశం ఉంది. తనకు కూతురు పుట్టిన కారణంగా.. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌కు రాహుల్ దూరంగా ఉన్నాడు. అయితే.. మార్చి 30న వైజాగ్‌లో జరిగే మ్యాచ్‌లో అతను ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున తొలి మ్యాచ్ ఆడే అవకాశముందని ఆ జట్టు ఆటగాడు విపరాజ్ నిగమ్ తెలిపారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ వేలంలో కేఎల్ రాహుల్‌ను రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా.. రాహుల్‌కు కెప్టెన్సీ ఉన్నప్పటికీ, ఈసారి ఆ బాధ్యతలు తీసుకోలేదు. అతను జట్టులో కీలక ఆటగాడిగా ఉంటూనే, నాయకత్వ బాధ్యతలను అక్షర్ పటేల్‌కు అప్పగించారు. గత సీజన్ వరకు రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్‌లో కీలక ప్లేయర్‌గా ఉన్నాడు.

Read Also: Janhvi Kapoor : రెచ్చిపోయిన జాన్వీకపూర్.. పిచ్చెక్కించే అందాల ఫోజులు..

ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున తొలి మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన విపరాజ్ నిగమ్.. రాహుల్ జట్టులో చేరడం తమకు మరింత బలాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. “ఈసారి కేఎల్ రాహుల్ మా జట్టులో ఉంటాడు. ఇది జట్టును సమతుల్యంగా మారుస్తుంది. ఒకే మ్యాచ్ ఆధారంగా జట్టును అంచనా వేయలేం. మా ఆటగాళ్లు అనుభవజ్ఞులు, సమర్థులు. రాబోయే మ్యాచ్‌లో మంచి ప్రదర్శన ఇవ్వబోతున్నామని ఆశిస్తున్నాం” అని నిగమ్ చెప్పారు. ఐపీఎల్‌లో తన తొలి మ్యాచ్ ఆడిన విపరాజ్ నిగమ్.. నాల్గవ బంతికే ఐడెన్ మార్క్రామ్ వికెట్ తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ విషయంపై స్పందిస్తూ.. “మొదటి మ్యాచ్‌లో కోచింగ్ సిబ్బంది, కెప్టెన్ నాపై నమ్మకం చూపించిన విధానం నాకు గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది. మొదట భయపడ్డాను, కానీ కొంతకాలం తర్వాత నేను హాయిగా ఫీలయ్యాను. తొలి మ్యాచ్‌లో మంచి ప్రదర్శన చేయడం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇది జట్టుకు ఉపయోగపడేలా నేను నా ప్రదర్శనను కొనసాగిస్తాను” అని నిగమ్ పేర్కొన్నారు. ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ బలంగా కనిపిస్తోంది. కేఎల్ రాహుల్ జట్టులో చేరడంతో వారి గెలుపు అవకాశాలు మరింత మెరుగుపడతాయని అభిమానులు ఆశిస్తున్నారు.

Read Also: Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌… మెట్రో రైలు సమయం పొడిగింపు