NTV Telugu Site icon

KL Rahul: లక్నో కెప్టెన్‌గా తప్పుకుంటున్న కేఎల్ రాహుల్.. 2025లో రిటైన్‌ కూడా కష్టమే!

Kl Rahul Lsg

Kl Rahul Lsg

KL Rahul to quit Lucknow Super Giants: ఉప్పల్ మైదానంలో బుధవారం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ల‌క్నో సూపర్ జెయింట్స్ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. ల‌క్నో నిర్ధేశించిన 166 ప‌రుగుల టార్గెట్‌ను ఎస్ఆర్‌హెచ్ కేవ‌లం 9.4 ఓవ‌ర్ల‌లోనే చేధించింది. సొంత మైదానంలో స‌న్‌రైజ‌ర్స్ ఓపెన‌ర్లు ట్రావిస్ హెడ్‌, అభిషేక్ శ‌ర్మ‌లు లక్నో బౌలర్లను ఊచ‌కోత కోశారు. ఈ ఇద్దరి వీరబాదుడుకు ఎస్ఆర్‌హెచ్ ఈజీగా విజ‌యాన్ని అందుకుంది. ఘోర ఓటమితో ల‌క్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ నిరుత్సాహానికి గుర‌య్యాడు. మ్యాచ్ ముగిసిన త‌ర్వాత తనకు మాట‌లు రావ‌డం లేద‌ని పేర్కొన్నాడు.

ఘోర ఓటమి తర్వాత ల‌క్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్‌ గోయెంకా కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌పై మండిపడ్డాడు. ఇందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ గురించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ఐపీఎల్ 2024లో లక్నో ఆడే చివరి రెండు మ్యాచులకు రాహుల్‌ కెప్టెన్‌గా వ్యవహరించకపోవచ్చని తెలుస్తోంది. ‘లక్నో తదుపరి మ్యాచ్‌ను మే 14న ఢిల్లీతో ఆడనుంది. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టడం కోసం రాహుల్ కెప్టెన్సీని వదిలేస్తాడని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. చివరి రెండు మ్యాచుల్లోనూ గెలిస్తేనే లక్నోకు ప్లే ఆఫ్స్‌ అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో మేనేజ్‌మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు’ అని ఐపీఎల్ వర్గాలు పేర్కొన్నాయి.

Also Read: IPL 2024 Playoffs Scenario: ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరం.. రెండు స్థానాలకు నాలుగు జట్ల మధ్య పోటీ! ఆర్‌సీబీకి కష్టమే

ఐపీఎల్‌లోకి లక్నో ప్రాంచైజీ అడుగుపెట్టినప్పటినుంచి కేఎల్‌ రాహుల్ నాయకత్వం వహిస్తున్నాడు. అతడి సారద్యంలో జట్టు 2022, 2023 సీజన్లలో ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఈసారి కూడా ప్లే ఆఫ్స్‌ దిశగా దూసుకెళ్లినా.. గత రెండు మ్యాచుల్లో భారీ ఓటమితో అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన రెండు మ్యాచుల్లోనూ గెలిచినా ప్లే ఆఫ్స్‌కు వెళ్తామనే గ్యారంటీ లేదు. దీంతో వచ్చే సీజన్‌ కోసం కొత్త కెప్టెన్‌ను ఎంచుకొనే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. 2025 మెగా వేలానికి ముందు రాహుల్‌ను రిటైన్‌ చేసుకునే అవకాశాలు చాలా తక్కువని వార్తలు వస్తున్నాయి. ఫ్రాంచైజీ ఓనర్ కెమెరాల ముందే సీరియస్‌గా మాట్లాడటంతో కేఎల్‌ రాహుల్ నోచుకున్నాడట. దాంతో స్వయంగా అతడు జట్టును వీడే ఛాన్స్‌ ఉందని కొందరు అంటున్నారు.