RCB Vs KKR: ఆర్సీబీతో మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన కేకేఆర్
- వర్షం కారణంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ రద్దు..
- రెండు జట్లకు చేరో పాయింట్.. 17 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో టాపర్ గా ఆర్సీబీ..
- 13 మ్యాచ్‌లలో 12 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తప్పుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RCB Vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 పున ప్రారంభానికి వరుణుడు భారీ షాక్ ఇచ్చాడు. ఈ మెగా టోర్నమెంట్లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేయబడింది. దీంతో చిన్నస్వామి స్టేడియం దగ్గర ఎడతెరిపి లేకుండా వాన పడుతుండటంతో టాస్ పడకుండానే మ్యాచ్‌ను అంపైర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
Read Also: OG : ఓజీ కోసం ముంబైకి పవన్..?
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
అయితే, రెండు జట్లకు చెరో పాయింట్ లభించింది. దీంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు అయ్యాయి. ప్లే ఆఫ్స్ రేసులో కేకేఆర్ నిలవాలంటే ఆర్సీబీపై కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు ఏకంగా మ్యాచ్ రద్దు కావడంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా కోల్‌కతా నిష్ర్కమించింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ 12 పాయింట్లతో ఈ క్యాష్ రిచ్ లీగ్ నుచి ఇంటిముఖం పట్టింది.
కాగా, ఆర్సీబీ ఖాతాలో ఒక్క పాయింట్ చేరడంతో 17 పాయింట్లతో టేబుల్ టాపర్ గా నిలిచింది. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్ చెరేందుకు బెంగళూరు జట్టు మరో అడుగు దూరంలో ఉంది. లాస్ట్ రెండు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ ఒక దాంట్లో విజయం సాధిస్తే చాలు ఈజీగా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఓడిపోయినా కూడా ఆర్సీబీకి ప్లే ఆఫ్స్‌కు చేరే ఛాన్స్ ఉంది. అయితే, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
ట్రెండింగ్
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!