Site icon NTV Telugu

Gautam Gambhir: గంభీర్ భయ్యా.. మీరు వెళ్లినప్పుడు మా హృదయం ముక్కలైంది!

Gautam Gambhir

Gautam Gambhir

KKR Fan Requests Gautam Gambhir: కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) రెండుసార్లు ఐపీఎల్ టైటిల్స్ గెలిచింది. గౌతమ్ గంభీర్‌ నాయకత్వంలో 2012, 2014లో కేకేఆర్ ఛాంపియన్‌గా నిలిచింది. కేకేఆర్ ఓనర్ షారుఖ్‌ ఖాన్‌తోనూ గంభీర్‌కు మంచి స్నేహం ఉంది. ఈ కారణంగానే మళ్లీ గౌతీ కోల్‌కతాలో భాగం అయ్యాడు. గంభీర్‌ ప్రస్తుతం కేకేఆర్ మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. గతేడాది లలక్నో సూపర్ జెయింట్స్‌కు వెళ్లిన గౌతీ.. తిరిగి కోల్‌కతాకు వచ్చేశాడు. ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో కేకేఆర్ అగ్రస్థానంలో కొనసాగడానికి ప్రధాన కారణం గంభీర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనుంది. ఈ క్రమంలో చర్చా కార్యక్రమంలో పాల్గొన్న గౌతమ్ గంభీర్‌కు ఓ అభిమాని నుంచి విజ్ఞప్తి వచ్చింది. ‘గంభీర్‌ భయ్యా.. మేం మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే. మీరు ఎప్పటికీ కోల్‌కతాను వదిలిపెట్టొద్దు. గతంలో మీరు కోల్‌కతా ను వదిలి వెళ్లినప్పుడు మా హృదయం ముక్కలైంది. ఆ బాధను మాటల్లో వర్ణించలేం. మీ కోసం ఓ బెంగాలీ పాటను అంకితం చేద్దామనుకుంటున్నా. మీరు ఎప్పటికీ మమ్మల్ని వదిలిపెట్టొద్దు. మీరు మా హృదయం. ప్లీజ్‌ సర్‌ ఎక్కడికీ వెళ్లొద్దు’ అంటూ అభిమాని కోరుకున్నాడు.

Also Read: Chennai Super Kings: గుజరాత్‌ మ్యాచ్‌లో ఓటమి.. చెన్నై ప్లేఆఫ్స్‌ అవకాశాలు సంక్లిష్టం!

అభిమాని మాటలకు గౌతమ్ గంభీర్‌ ముసిముసిగా నవ్వుకున్నాడు. ఈ వీడియోను కోల్‌కతా నైట్ రైడర్స్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. దీనికి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 17వ సీజన్‌లో 11 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా.. 8 విజయాలను ఖాతాలో వేసుకుంది. కేకేఆర్ ప్రస్తుతం 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. నేడు ముంబైతో జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన మొదటి జట్టుగా నిలుస్తుంది.

Exit mobile version