NTV Telugu Site icon

Rishabh Pant: మేం దారుణంగా విఫలమయ్యాం.. ప్రతీ రోజు మనది కాదు: రిషబ్ పంత్

Rishabh Pant Interview

Rishabh Pant Interview

Rishabh Pant React on DC Defeat vs KKR: బ్యాటింగ్ యూనిట్‌గా తాము దారుణంగా విఫలమయ్యాం అని, అదే తమ ఓటమిని శాసించిందని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ తెలిపాడు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో 150 పరుగుల లక్ష్యం చాలా తక్కువ అని పేర్కొన్నాడు. తప్పుల నుండి తాము నేర్చుకుంటామని, ప్రతి రోజు మనది కాదని పంత్ అన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

Also Read: T20 World Cup 24: రాహుల్, గిల్‌లకు నో ప్లేస్.. కీపర్‌గా సంజూ! భారత జట్టు ఇదే

మ్యాచ్ అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ… ‘ముందు బ్యాటింగ్ చేయడం మంచి ఆప్షన్. ఈ మ్యాచ్‌లో మా బ్యాటింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ యూనిట్‌గా మేం విఫలమయ్యాం. టోర్నీలో ఈసారి భారీ స్కోర్స్ నమోదవుతున్నాయి. 150 పరుగుల లక్ష్యం అంటే చాలా తక్కువ. 180-210 మంచి స్కోరని నేను భావిస్తున్నాను. మా బౌలర్లకు మేం పోరాడే లక్ష్యాన్ని ఇవ్వలేకపోయాం. మా తప్పిదాల నుంచి మేం పాఠాలు నేర్చుకుంటాం. ప్రతీ రోజు మనది కాదు. మేం ప్లే ఆఫ్స్ చేరాలంటే.. మిగతా 5 మ్యాచ్‌ల్లో కనీసం నాలుగు గెలవాలి. సమష్టి ప్రదర్శనతో ముందుకు వెళతాము’ అని అన్నాడు.

Show comments