NTV Telugu Site icon

Philip Salt: ఫిల్‌ సాల్ట్‌ విధ్వంసం.. సౌరవ్ గంగూలీ రికార్డు బ్రేక్!

Philip Salt

Philip Salt

Philip Salt Becomes 1st Batter To Hit Most Runs in Eden Gardens: ఐపీఎల్‌ 2024లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్) మరో అద్భుత విజయం సాధించింది. ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో కేకేఆర్ గెలిచింది.154 పరుగుల లక్ష్యంను కేవలం 3 వికెట్లు కోల్పోయి 16.3 ఓవర్లలోనే చేధించింది. కేకేఆర్‌ ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68 పరుగులు చేశాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును సాల్ట్‌ బ్రేక్ చేశాడు.

ఓ ఐపీఎల్ సీజన్‌లో ఈడెన్‌ గార్డెన్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఫిల్‌ సాల్ట్‌ రికార్డుల్లో నిలిచాడు. ఈ సీజన్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో ఆడిన ఆరు మ్యాచ్‌లలో సాల్ట్ 344 రన్స్ చేశాడు. అంతకుముందు ఈ రికార్డు ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ పేరిట ఉంది. 2010 సీజన్‌లో ఈడెన్‌ గార్డెన్స్‌లో దాదా 7 ఇన్నింగ్స్‌ల్లో 331 పరుగులు చేశాడు. ఈ జాబితాలో ఆండ్రీ రసెల్, క్రిస్ లిన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఐపీఎల్ 2019లో రసెల్ 7 ఇన్నింగ్స్‌ల్లో 311 పరుగులు చేశాడు. ఐపీఎల్ 2018లో లిన్ 9 ఇన్నింగ్స్‌ల్లో 303 పరుగులు బాదాడు.

Also Read: Mehreen Pirzada: మెహ్రీన్ పిర్జాదా ‘ఎగ్ ఫ్రీజింగ్’.. వీడియో వైరల్!

ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతోంది. ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆరింట్లో గెలిచి.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. అద్భుత విజయాలతో ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపర్చుకుంటుంది. మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో రెండు గెలిస్తే.. ప్లే ఆఫ్ బెర్త్ దక్కుతుంది. మూడు విజయాలు సాధిస్తే.. అధికారిక బెర్త్ దక్కుతుంది. కేకేఆర్ ప్రస్తుత ఫామ్ చూస్తే ప్లే ఆఫ్ చేరడం పక్కా.

Show comments