Site icon NTV Telugu

IPL: బీజేపీ కార్యకర్త వల్లే చెన్నై సూపర్ కింగ్స్ విజయం.. అన్నామలై సంచలన వ్యాఖ్యలు..

Ravindra Jadeja

Ravindra Jadeja

IPL: ఐపీఎల్ 2023లో మరోసారి కప్ ఎగరేసుకుపోయింది చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే). ధోని సారథ్యంలో 5వ సారి ఛాంపియన్స్ గా నిలిచింది. రెండు రోజుల క్రితం జరిగి ఐపీఎల్ ఫైనల్స్ లో గుజరాత్ టైటాన్స్ ను ఓడించింది. ఇదిలా ఉంటే సీఎస్కే విజయంపై బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నామలై మాట్లాడుతూ.. బీజేపీ కార్యకర్త రవీంద్ర జడేజా వల్లే సీఎస్కే విజయం సాదించిందని అన్నారు. జడేజా బీజేపీ కార్యకర్త అని తమిళనాడు బీజేపీ నేత ట్వీట్ చేశారు. గతేడాది గుజారాత్ ఎన్నికల సమయంలో రవీంద్ర జడేజా, అతని భార్య రివాబా జడేజా బీజేపీలో చేరారు. రివాబా బీజేపీ తరుపున ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు.

Read Also: Manipur Violence: మయన్మార్ నుంచి మణిపూర్‌లోకి 300 మంది ఉగ్రవాదులు.. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ హెచ్చరిక..

కప్ గెలుచుకున్న సీఎస్కేకు అభినందనలు తెలియేశారు. ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ యాంకర్‌తో అన్నామలై మాట్లాడుతూ.. సీఎస్‌కే గెలిచినందుకు గర్వపడుతున్నా.. సీఎస్‌కేలో కన్నా గుజరాత్ టైటాన్స్ లోనే ఎక్కువ మంది తమిళ ఆటగాళ్లు ఉన్నందున గుజరాత్ టైటాన్స్‌తో పాటు ప్రజలు కూడా సంబరాలు చేసుకోవాలని అన్నారు. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం అన్నామలైపై కౌంటర్లు వేశారు. గుజరాత్ మోడల్ పై ద్రవిడియన్ మోడల్ గెలిచిందన్నారు.

ఐపీఎల్ 2023 ఫైనల్ మే 29న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. తమిళనాడు బ్యాట్స్‌మెన్ సాయి సుదర్శన్ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేశాడు. 47 బంతుల్లో 96 పరుగులు చేశాడు. అయితే వర్షం కారణంగా మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించడంతో సీఎస్‌కేకి 15 ఓవర్లలో 171 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో చివరి రెండు బంతులను సిక్స్, ఫోర్ గా మలిచి రవీంద్ర జడేజా సీఎస్కేకి విజయాన్ని అందించారు.

Exit mobile version