Ishan Kishan Emotional: అతడి కోసం మ్యాచ్ గెలవాలనుకున్నా.. అదే నా మోటివేషన్!
- చెన్నై సూపర్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయం
- 47 బంతుల్లో 70 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్
- ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఇషాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత విజయం అందుకుంది. సన్‌రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశాడు. చెపాక్ వంటి కఠినమైన పిచ్‌పై 47 బంతుల్లో 70 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్.. మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్ వెనుక ఉన్న అసలు మోటివేషన్ ఏంటో తెలిపాడు. ఇటీవల తన కుటుంబంలో జరిగిన విషాదం, మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన బంధువుల కోసం ఈ మ్యాచ్‌ను ఫినిష్ చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు. తన కజిన్ కుటుంబం ఈ ఇన్నింగ్స్‌ను చూడటం తనకు చాలా ఆనందంగా అనిపించిందని ఇషాన్ చెప్పాడు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. ‘వికెట్ కీపింగ్ చేస్తున్నప్పుడు ఈ పిచ్‌పై బ్యాటింగ్ అంత సులభం కాదని అర్థమైంది. ముఖ్యంగా స్పిన్నర్లు, స్లో బాల్స్ చాలా ప్రభావం చూపించాయి. ఈ టార్గెట్ ఛేజ్ చేయడం కష్టమని అనిపించింది. కానీ నంబర్-3 బ్యాటర్‌గా నా బాధ్యత మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లడమే. చివర్లో వచ్చే బ్యాటర్లకు సింగిల్స్ తీయడం, బౌండరీలు కొట్టడం కష్టం అవుతుంది. అందుకే నేను చివరి వరకు ఉండాలని అనుకున్నా’ అని చెప్పాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఇలాంటి కఠినమైన పిచ్‌పై ఎలా బ్యాటింగ్ చేయాలనే ప్రశ్నకు ఇషాన్ ఆసక్తికరంగా స్పందించాడు. ‘ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమైనది ఆత్మవిశ్వాసం. మనపై మనకు నమ్మకం ఉండాలి. ఒక్క క్షణం కూడా సందేహపడకూడదు. నేను ఎక్కువ ఓవర్లు బ్యాటింగ్ చేయాలని భావించాను. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా క్రీజులో ఉంటే బౌలర్లకు లైన్లు, లెంగ్తులు కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. అందుకే సింపుల్‌గా ఆడుతూ మ్యాచ్‌ను చివరి వరకు తీసుకెళ్లాలని ప్రయత్నించాను’ అని తెలిపాడు.
హెన్రిచ్ క్లాసెన్‌తో భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ.. ‘మేమిద్దరం ప్రత్యేకంగా ఏం మాట్లాడుకోలేదు. మా షాట్లు మేము ఆడుకుంటూ వెళ్లాం. కానీ నాకు అసలు ప్రేరణ మా కుటుంబం. నా కజిన్ ఇక్కడ స్టేడియంలో ఉన్నాడు. ఇటీవల అతడు తన సోదరిని కోల్పోయాడు. మా కుటుంబానికి అది చాలా కష్టమైన సమయం. ఘటన అనంతరం వారు మొదటిసారి స్టేడియంలో మ్యాచ్ చూడటానికి వచ్చారు. వాళ్ల కోసం ఈ మ్యాచ్ ఫినిష్ చేయాలనుకున్నా. వారు ఈ ఇన్నింగ్స్ చూడటం నాకు ఎంతో ఆనందంగా ఉంది’ అని భావోద్వేగానికి గురయ్యాడు. ‘పై నుంచి ఎవరో నాకు శక్తినిస్తున్నట్టుగా అనిపించింది. నేను జట్టుకోసం చివరి వరకు ఉంటే.. మేము ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం వచ్చింది. ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం, మా కుటుంబ సభ్యులు సంతోషపడటం నాకు చాలా ప్రత్యేకం’ అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
-
Gurudwara Demolished: పాకిస్థాన్‌కి ఎంత బలుపు.. 125 ఏళ్ల నాటి చారిత్రక గురుద్వారా కూల్చివేత! భారత్ రియాక్షన్ ఇదే..
-
Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్‌గా ఇషాన్ కిషన్.!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!