Vaibhav Sooryavanshi: “ఇదే కరెక్ట్ టైమ్.. నిర్ణయం తీసుకోండి”.. వైభవ్ సూర్యవంశీ విషయంలో రెచ్చిపోతున్న అభిమానులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. కేవలం 15 ఏళ్ల వయసులోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లను ముప్పతిప్పలు పెడుతూ భయం తెలియని ఆటతీరుతో మైదానంలో పూనకాలు తెప్పించాడు. నాకౌట్ మ్యాచ్ అనే ఒత్తిడి అస్సలు లేకుండా లెంత్ బాల్స్, షార్ట్ పిచ్ బాల్స్, ఆఖరికి యార్కర్లను సైతం స్టేడియం అవతలికి పంపుతూ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఈ మ్యాచ్‌లో సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ ఒక్కసారిగా వైభవ్‌పై ప్రేమ కురిపించారు. ఈ బుడ్డోడిని వెంటనే టీమిండియాలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తే అనేక మీమ్స్ వైరల్ చేస్తున్నారు. ఇలాంటి ఒక ప్లేయర్ టీమిండియాలో ఉంటే మన జట్టుకు అస్సలు తిరుగు ఉండదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వైభవ్ పోస్టులతో నిండిపోయింది. “ఇదే కరెక్ట్ టైమ్” అంటూ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు.
మరోవైపు.. నిన్న ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకం రికార్డును (సురేష్ రైనా రికార్డుతో సమానంగా) అందుకున్నాడు. అంతేకాదు, ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ (59 సిక్సర్లు) రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఏకంగా 12 సిక్సర్లు బాదిన వైభవ్, ఈ సీజన్లో తన మొత్తం సిక్సర్ల సంఖ్యను 65కు చేర్చుకున్నాడు. సెంచరీ ఖాయం అనుకుంటున్న తరుణంలో కేవలం 29 బంతుల్లో 97 పరుగులు (5 ఫోర్లు, 12 సిక్సర్లు) చేసి దురదృష్టవశాత్తూ అవుట్ అయ్యాడు. దీనివల్ల క్రిస్ గేల్ పేరిట ఉన్న అత్యంత వేగవంతమైన ఐపీఎల్ శతకం (30 బంతుల్లో) రికార్డును తృటిలో మిస్ చేసుకున్నాడు. అయితే, ఈ ఇన్నింగ్స్ ద్వారా ఈ సీజన్లో అతని మొత్తం పరుగుల సంఖ్య 680కి చేరింది. తద్వారా ఐపీఎల్లో ఒకే సీజన్లో అత్యధిక పరుగులు చేసిన అన్క్యాప్డ్ (ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయని) ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు అతని టీమ్మేట్ యశస్వి జైస్వాల్ (626 పరుగులు – 2023 ఐపీఎల్) పేరిట ఉండేది. ఈ క్లాస్ ఇన్నింగ్స్ చూసిన క్రికెట్ ఫ్యాన్స్, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అతనికి వెంటనే భారత జాతీయ జట్టులో అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 15 ఏళ్ల వయసులోనే ఇంత పరిణతి, ఫామ్ ఉన్నప్పుడు ‘వేచి చూసే ధోరణి’ కాకుండా, టీమిండియా అతని ఫామ్‌ను ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు.
Also Read
- Kavya Maran Crying: ఎస్ఆర్హెచ్ దారుణ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన కావ్య పాప.. వీడియో వైరల్!
- Vaibhav Net Worth: "కోటీశ్వరుడే నండోయ్".. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ నికర ఆస్తి విలువ ఎంతో తెలుసా?
- Vaibhav Sooryavanshi: నేను ఆ మూడింటి పైనే ఫోకస్ చేస్తా.. ప్రత్యర్థి బౌలర్లు ఏం ప్లాన్ చేసినా నాకు అనవసరం!
- Vaibhav Sooryavanshi Records: బేబీ బాస్ బీభత్సం.. ఒక్క తుఫాన్ ఇన్నింగ్స్ తో వైభవ్ ఖాతాలోకి చేరిన రికార్డ్స్ ఇవే.!
Vaibhav Sooryavanshi’s bat swing has been outstanding. What’s even more remarkable is how beautifully he clears his front foot to create room for balls aimed at his legs. This freedom allows him to play the way he does.
That innings was nothing short of spectacular!
— Sachin Tendulkar (@sachin_rt) May 27, 2026
Baby Boss Vaibhav Sooryavanshi 12 sixes But Out 97(29) Really Heartbroken 💔
— Muskan 19 (@sareen_719) May 27, 2026
Sooryavanshi 💥
97(29) pic.twitter.com/1ZQyZVecM7— Prasad (@Prarth__) May 27, 2026
Vaibhav Sooryavanshi is scoring faster and hitting bigger than imaginative shadow batting we all did in our childhood. He is just a child. Damn !
— Prasad Bhojak (@BhojakPb) May 27, 2026
Bhai ye Video game khelta hai Real game mein.
Naam hai – Vaibhav Sooryavanshi #SRHvsRR pic.twitter.com/WZROsIZKCO— AD_100K ( Kattar Hindu ) (@AnkitDu48974234) May 27, 2026
VAIBHAV SOORYAVANSHI HAS THE 2ND BEST STRIKE RATE FOR A 70+ RUNS INNINGS IN IPL HISTORY 🤯🔥🏏
15 years old and already creating madness beyond imagination 🚀🥶#SRHvsRR pic.twitter.com/QWcHiGgHog
— Aman Sharma (@amancrick_news) May 27, 2026
97 in 29 balls at 15 years old.
No PR.
No “next big thing” agenda.
Just pure violence against international bowlers on live TV.Vaibhav Sooryavanshi might genuinely be the craziest cricket talent India has ever seen. 🤯🔥 #IPL2026 #RRvsSRH
— Abhyuday vijay jaiswal (@AbhyudayVijay18) May 27, 2026
Vaibhav Sooryavanshi.
That’s it. That’s the tweet.
— Whistle Podu (@whistlepoduclub) May 27, 2026
Vaibhav Sooryavanshi is the new virat of india
— Gaurav Kshtriya (@kshtriya_gaurav) May 27, 2026
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “ఇదే కరెక్ట్ టైమ్.. నిర్ణయం తీసుకోండి”.. వైభవ్ సూర్యవంశీ విషయంలో రెచ్చిపోతున్న అభిమానులు
-
NTR : తెలుగువారి ఆత్మగౌరవం.. అఖండ తెలుగు జాతి కీర్తి పతాకం.. ‘ఎన్టీఆర్’ 103వ జయంతి సందర్భంగా ఘన నివాళి!
-
Protein Food Demand: ప్రోటీన్ కోసం భారతీయుల తొలి ఎంపిక ఇవే.. ఆన్లైన్ ఆర్డర్లలో కొత్త రికార్డులు..!
-
Kavya Maran Crying: ఎస్ఆర్హెచ్ దారుణ ఓటమి.. వెక్కివెక్కి ఏడ్చిన కావ్య పాప.. వీడియో వైరల్!
-
Praggnanandhaa – Magnus Carlsen: వరల్డ్ నం.1 కార్ల్సెన్ కు ‘ప్రజ్ఞానంద’ చెక్‌మేట్.!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్‌తో HONOR 600 సిరీస్ లాంచ్.!