Trevor Penney: వైభవ్ సూర్యవంశీ చాలా ఫీల్ అయ్యాడు.. కోచ్ ట్రెవర్ పెన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trevor Penney: ఈ సీజన్లో రాజస్థాన్ దూకుడు మామూలుగా లేదు. నిన్న జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)తో జరిగిన మ్యాచ్‌లో దూకుడుకు ఒక్కసారిగా బ్రేట్ పడింది. ఆర్ఆర్ టీమ్ అంటేనే 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్య వంశీ గుర్తుకు వస్తాడు. స్టార్ పేసర్లు సైతం వైభవ్‌ను కట్టడి చేయలేకపోయారు. ఐపీఎల్ 2026లో అత్యధిక స్కోరర్లలో ఒకడిగా నిలిచాడు వైభవ్. ఇప్పటికే 15 బంతుల్లో రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. ఎస్ఆర్హెచ్ మ్యాచుకు ముందు ఆడిన మొదటి నాలుగు ఐపీఎల్ 2026 మ్యాచ్‌లలో సూర్యవంశీ వరుసగా 52, 31, 39, 78 స్కోర్లు సాధించాడు. అయితే, సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్యవంశీకి ప్రఫుల్ హింగే కళ్లెం వేశాడు. ఇదిలా ఉండగా.. నిన్నటి మ్యాచ్‌లో వైభవ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై రాజస్థాన్ రాయల్స్ సహాయ కోచ్ ట్రెవర్ పెన్నీ (Trevor Penney) సమాధానమిచ్చారు. “గత మ్యాచ్‌లో ఫీల్డింగ్‌కు దూరమైనప్పుడు వైభవ్ సూర్య వంశీ చాలా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే అతనికి ఫీల్డింగ్ అంటే చాలా ఇష్టం. చాలా మంచిగా ఫీల్డింగ్ చేస్తాడు. కానీ టీమ్ కాంబినేషన్ కారణంగా అతడిని ఫీల్డింగ్‌కు దించలేకపోయాం. దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో కాలర్ బోన్ గాయంతో దూరమైన గన్ ఫీల్డర్ డోనోవన్ ఫెరీరా తిరిగి ఫిట్నెస్ సాధించడంతో అతడిని తుది జట్టులోకి తీసుకోవాల్సి వచ్చింది. అందుకే వైభవ్ ఫీల్డింగ్‌లో భాగం కాలేకపోయాడు. ఫీల్డింగ్‌లో రాణించలేకపోవడం వల్లే తీసుకోలేదనే వాదన తప్పు.” అని ట్రెవర్ పెన్నీ (Trevor Penney) వివరించారు.
READ MORE: Telugu Cinema : రూట్ మారుస్తోన్న టాలీవుడ్ హీరోలు.. పీరియాడిక్ కథలపై ఫోకస్
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఇదిలా ఉండగా.. నిన్న జరిగిన మ్యాచ్ ఎస్ఆర్హెచ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. సన్‌రైజర్స్ 216 లక్ష్యాన్ని నిర్దేశించగా.. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ తడబడింది. విదర్భ పేసర్ ప్రఫుల్ హింగే, బీహార్ పేసర్ సాకిబ్ హుస్సేన్ అద్భుతమైన బౌలింగ్‌తో రాజస్థాన్ బ్యాటర్లను కట్టడి చేశారు. వీరిద్దరి ధాటికి రాజస్థాన్ 159 పరుగులకే కుప్పకూలింది. ఈ ఓటమితో ఆర్ఆర్ వరుస విజయాలకు అడ్డుకట్ట పడినప్పటికీ, పాయింట్ల పట్టికలో ఆ జట్టు ఇంకా అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. మరోవైపు ఈ అద్భుత విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐదు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ మెరుపులు, బౌలింగ్‌లో కుర్ర పేసర్ల ప్రదర్శన వెరసి హైదరాబాద్‌కు ఈ సీజన్లో అత్యంత అవసరమైన విజయాన్ని అందించాయి.
తాజావార్తలు
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!