IPL 2026: ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. మంత్రి ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రాంతానికి చెందిన యువ క్రికెటర్ త్రిపురాన విజయ్ ప్రతిష్టాత్మక ఐపీఎల్ 2026 బరిలో నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా విజయ్ ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో అతను 2 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చినప్పటికీ, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రాజస్థాన్ పైన 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
తెలుగు కుర్రాడైన త్రిపురాన విజయ్ సాధించిన ఈ గొప్ప మైలురాయిపై కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సందేశం..
మన శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ సాధారణ యువకుడు జాతీయ స్థాయిలో ఇంతటి ప్రతిష్టాత్మక వేదికపై నిలవడం తెలుగు ప్రజలందరికీ ఎంతో గర్వకారణమన్నారు. శ్రీకాకుళం నేల ఎప్పుడూ ప్రతిభకు, పట్టుదలకు నిలయమే అని… దేశ సేవలో సైనికులుగానైనా, క్రీడారంగంలో సత్తా చాటే యువకులుగానైనా మన ప్రాంత యువత అన్ని రంగాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోందన్నారు. ఈ అరంగేట్రం త్రిపురాన విజయ్ కెరీర్లో మొదటి అడుగు మాత్రమేనని, భవిష్యత్తులో అతను మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
Congratulations to Tripurana Vijay, our local boy from Srikakulam, on making his IPL debut — the first of many more milestones to come. Wishing him the very best for an exciting journey ahead. Play bold, stay grounded, and continue inspiring the youth.
The youth of Srikakulam… pic.twitter.com/sQ69bs7Lbd
— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) May 18, 2026
దీంతో పాటు యువతకు పిలుపునిస్తూ ఇలా అన్నారు. అడ్డంకులను ఛేదించండి, పెద్ద కలలు కనండి. లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అంకితభావం, క్రమశిక్షణ గనుక ఉంటే జీవితంలో సాధ్యం కానిది ఏదీ లేదన్నారు. మొదటి మ్యాచ్‌లో ప్రదర్శనతో సంబంధం లేకుండా, పట్టుదలతో ముందడుగు వేసిన విజయ్ ప్రయాణం ఎంతో మంది గ్రామీణ ప్రాంత యువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తోంది. భవిష్యత్తు మ్యాచుల్లో అతను మరింత రాణించాలని తెలుగువారంతా కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
VVS Laxman vs Gautam Gambhir: ఇప్పుడు గంభీర్ వర్సెస్ లక్ష్మణ్ చర్చ ఎందుకు..?
-
TGPSC : రోడ్డుపై OMR షీట్ల కలకలం.. వివరణ ఇచ్చిన TGPSC
-
Off The Record: కాల్వ శ్రీనివాసులు పై ఈ ప్రచారం మొదలు పెట్టింది ఎవరు..?
-
Bihar: నీట్ నిరసనకారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. ఎఫ్ఐఆర్లు ఉపసంహరణ
-
Instagram: భారత్‌లో ఇన్స్టాగ్రామ్ నిషేధం! సోషల్ మీడియాలో పుకార్లు
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!