SRH vs RR: నిన్న ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ జెండాలు రెపరెపలాడాయి. సొంత గడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మరోసారి సత్తా చాటింది. రాజస్థాన్ రాయల్స్ (RR)తో జరిగిన మ్యాచ్ ఉత్కంఠగా కొనసాగింది. ఐపీఎల్ చరిత్రలోనే పవర్ ఫుల్ ఇన్నింగ్స్‌లా మారింది. ఓ యువ సంచలనం అరంగేట్రానికి ఈ మ్యాచ్ వేదికైంది. పేసర్ ప్రఫుల్ హింజ్(4/34) తన తొలి మ్యాచ్‌లోనే రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కూల్చేశాడు. కలలో కూడా ఊహించని రీతిలో డెబ్యూ చేశాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 216 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఛేదనలో రాజస్థాన్‌కు ప్రఫుల్ హింజ్ చుక్కలు చూయించాడు. బుమ్రా, స్టెయిన్, మలింగ వంటి స్టార్ పేసర్లకు సైతం సాధ్యం కాని రికార్డులు బద్ధలుగొట్టాడు. మొదటి ఓవర్‌లోని రెండో బంతికి వైభవ్ సూర్యవంశీని ‘గోల్డెన్ డక్’ (0)గా పంపి సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత అదే ఓవర్‌లో ధ్రువ్ జూరెల్ (0), లూండ్రే ప్రిటోరియస్ (0)లను సైతం పెవిలియన్‌కు పంపాడు. తొలి ఓవర్‌లోనే రాజస్థాన్ రాయల్స్‌ను 1/3కి పరిమితం చేశాడు. ఇక ప్రఫుల్ హింగే ఐపీఎల్ 19 ఏళ్ల చరిత్రలో మొదటి ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ప్రఫుల్ రికార్డు సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి కేవలం 18 పరుగులే ఇచ్చి 4 వికెట్లు (4/18) పడగొట్టి మరో రికార్డు కైవసం చేసుకున్నాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో తొలి ఆరు ఓవర్లలో నాలుగు అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలోనూ ప్రఫుల్ హింగే చోటు దక్కించు కున్నాడు. ప్రఫుల్‌హింగే కంటే ముందు ఇషాంత్ శర్మ, షోయ్ అక్తర్, అజిత్ చండీలా, దావల్ కులకర్ణి, పాట్ కమిన్స్, దీపక్ చాహర్, మహ్మద్ షమీ ఈ ఫీట్ సాధించారు.
READ MORE: Earthquake: అమెరికాలో భూకంపం.. పలు ప్రాంతాల్లో ప్రకంపనలు
ఇక SRH vs RR పోరులో హైలెట్స్ విషయానికి వస్తే.. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ ఇషాన్ కిషన్ 91 పరుగులు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు.. ప్రఫుల్ హింజ్, షకీబ్ హుస్సేన్ చెరో నాలుగు వికెట్ల ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)జట్టు రాజస్థాన్ రాయల్స్ (RR)ను 57 పరుగుల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ 216 స్కోర్ చేసింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 91 పరుగులు), హెన్రిచ్ క్లాసెన్ (26 బంతుల్లో 40 పరుగులు), నితీష్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 28 పరుగులు) రాణించారు. ఛేజింగ్ బరిలోకి దిగిన రాజస్థాన్ తొలి ఓవర్‌లోనే కుప్పకూలింది. ప్రఫుల్ హింజ్ ధాటికి తోడు మరో అరంగేట్ర బౌలర్ సాకిబ్ హుస్సేన్ కూడా రెచ్చిపోయాడు. మూడో ఓవర్‌లో ప్రఫుల్.. రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్‌ను అవుట్ చేయడంతో రాజస్థాన్ కేవలం 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే రవీంద్ర జడేజా (45), డోనోవన్ ఫెరీరా (69) కలిసి 118 పరుగుల భాగస్వామ్యంతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ సాకిబ్ హుస్సేన్ (4/24) వీరిద్దరినీ అవుట్ చేసి రాజస్థాన్ ఆశలపై నీళ్లు చల్లాడు. చివరకు రాజస్థాన్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయింది.
READ MORE: Praful Hinge: 4 వికెట్స్ తీస్తానని ముందే రాసిపెట్టుకున్నా.. నేను మానిఫెస్టేషన్‌ను నమ్ముతా!
