Sai Sudharsan: చిన్నప్పుడు రోడ్డుపై ఆ జట్టును చూసేవాడిని.. ఇప్పుడు అదే జట్టుపై రికార్డులు: సాయి సుదర్శన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ సాయి సుదర్శన్‌కు, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు మధ్య ఒక విచిత్రమైన, భావోద్వేగమైన బంధం ఉంది. చిన్నతనంలో తన స్కూల్ ముందు నుంచి చెన్నై జట్టు బస్సు వెళ్తుంటే, కనీసం ఆ బస్సునైనా చూడాలని రోడ్డు పక్కన నిలబడేవాడినని ఈ 24 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాటర్ గుర్తుచేసుకున్నాడు. అయితే.. తాను ఎంతగానో ఆరాధించిన ఆ హోమ్ టౌన్ జట్టుపైనే ఇప్పుడు ఐపీఎల్లో పరుగుల వరద పారించడం విశేషం.
సీఎస్కేపై ప్రత్యేక రికార్డులు..
2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన సుదర్శన్.. 2023 ఐపీఎల్ ఫైనల్లో చెన్నైపైనే 47 బంతుల్లో 96 పరుగుల సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత 2024లో అహ్మదాబాద్‌లో చెన్నైపైనే తన మొదటి ఐపీఎల్ సెంచరీని కూడా నమోదు చేశాడు. “సీఎస్కేతో నాకు లోతైన ఎమోషనల్ కనెక్ట్ ఉంది. వారిపై మంచి ప్రదర్శన చేయడం దేవుడి కృప” అని సుదర్శన్ పేర్కొన్నాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
ఆరెంజ్ క్యాప్ విజేతగా రికార్డులు..
సాయి సుదర్శన్ గ్రాఫ్ ఏటా పెరుగుతూనే ఉంది. 2023లో 362 పరుగులు చేసిన అతడు, 2025 సీజన్లో ఏకంగా 759 పరుగులు సాధించి ‘ఆరెంజ్ క్యాప్’ దక్కించుకున్నాడు. ఐపీఎల్లో కేవలం 50 ఇన్నింగ్స్‌ల్లోనే అత్యధిక పరుగులు చేసిన క్రిస్ గేల్ రికార్డును సైతం సుదర్శన్ బద్దలు కొట్టాడు. ఈ మైలురాళ్లు తనపై తనకు నమ్మకాన్ని పెంచుతాయని అతడు తెలిపాడు.
గిల్‌తో భాగస్వామ్యం.. భవిష్యత్తుపై దృష్టి
కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో తనకున్న కెమిస్ట్రీ గురించి మాట్లాడుతూ.. “గిల్ మైండ్ గేమ్స్ ఆడటంలో దిట్ట. తను క్రీజులో ఉంటే నాకు ఎంతో స్వేచ్ఛ ఉంటుంది. ఇద్దరం ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని బ్యాటింగ్ చేస్తాం” అని చెప్పాడు.
గతం గురించి ఆలోచించడం కంటే ప్రస్తుతంలో జీవించడమే ముఖ్యమని నమ్మే సుదర్శన్, టీ20 క్రికెట్లో పరిస్థితులకు తగ్గట్టుగా మారడమే అత్యంత కీలకమని స్పష్టం చేశాడు. ఒక్క ఇన్నింగ్స్ ఫెయిల్ అయితే వచ్చే ఒత్తిడిని మైండ్లోకి తీసుకోకుండా, ప్రతి రోజును ఒక కొత్త ఆరంభంలా చూస్తానని ఈ యువ సంచలనం వివరించాడు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?