Toes Writing: నిరాశకు లొంగని ధైర్యం.. చేతులు లేకపోయినా సాటిలేని ప్రతిభ.. కాళ్లతో రాసి ఫస్ట్ డివిజన్ సాధించిన శివాని
- విద్యార్థిని చేతులు లేకపోయినా సాటిలేని ప్రతిభ
- కాళ్లతో రాసి ఫస్ట్ డివిజన్ సాధించిన శివాని
- 60 శాతం మార్కులతో ఫస్ట్ డివిజన్లో ఉత్తీర్ణత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంకల్పబలం ఉంటే ఏదైనా సాధ్యమే. కలలుకని వాటిని నిజం చేసుకోవడానికి తగిన కృషి చేస్తే సాధించలేనిది ఏదీ ఉండదు. అంకితభావం ఉంటే ఎన్ని అవరోధాలు అడ్డొచ్చిన లక్ష్యాన్ని ఛేదించొచ్చు. ఇదే రీతిలో ఓ విద్యార్థిని చేతులు లేకపోయినా సాటిలేని ప్రతిభ కనబర్చి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. ఈ మాటలు ఇప్పుడే ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి చేసుకున్న శివానికి చక్కగా సరిపోతాయి. శారీరక వైకల్యం ఉన్నప్పటికీ అసాధ్యమనిపించే లక్ష్యాన్ని సాధించిన అద్భుత యువతి శివాని. చేతులు లేని శివాని తన కాలి వేళ్లతోనే పరీక్ష ప్రశ్నపత్రాలకు సమాధానాలు రాసి, 60 శాతం మార్కులతో ఫస్ట్ డివిజన్లో ఉత్తీర్ణత సాధించింది.
ఉత్తరప్రదేశ్‌లోని నగరంలోని నయాగంజ్లో నివసించే ధర్మరాజ్ కుమార్తె శివానికి పుట్టినప్పటి నుంచి రెండు చేతులు లేవు. అయినా ఆమె దృఢ సంకల్పంతో ముందుకు సాగింది. రుదౌలిలోని ప్రభుత్వ బాలికల ఇంటర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. తండ్రి ధర్మరాజ్ ట్రాక్టర్ డ్రైవర్‌గా, కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. శివాని చిన్నతనంలో ట్యూబ్‌వెల్‌లో చిక్కుకుపోవడం వల్ల రెండు చేతులు కోల్పోయిందని తండ్రి ధర్మరాజ్ తెలిపారు. ఆ సంఘటన తర్వాత కుటుంబం తీవ్రంగా కుంగిపోయింది. కానీ శివాని వెనకడుగు వేయలేదు. ఎంతో శ్రద్ధగా చదువు కొనసాగించింది. చేతులు లేకపోవడంతో మొదట్లో కష్టపడినా, నెమ్మదిగా కాళ్లతో రాయడం అలవాటు చేసుకుంది. కాలక్రమేణా ఆమె రాత వేగం మెరుగుపడింది. హైస్కూల్లోనూ, ఇంటర్మీడియట్‌లోనూ కాళ్లతోనే పరీక్షలు రాసి విజయం సాధించింది.
Also Read
శివానిని నిరాశ ఎప్పుడూ ఆవరించలేదు. ఆమె నిరంతరం విజయాలు సాధిస్తూనే ఉంది. శివాని విజయాన్ని గుర్తించి సామాజిక కార్యకర్త డాక్టర్ నెహల్ రజా శివానిని సత్కరించారు. మిఠాయిలు అందజేసి అభినందనలు తెలిపారు. తన విజయానికి ప్రిన్సిపాల్ అఫ్రీన్ ఫాతిమా, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులే ప్రధాన కారణమని శివాని హృదయపూర్వకంగా పేర్కొంది. 2024లో హైస్కూల్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన శివాని, ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న తర్వాత బీఏ చదవాలని ఆశిస్తోంది. శివాని విద్యను కొనసాగించడానికి అండగా నిలుస్తానని డాక్టర్ నెహల్ రజా హామీ ఇచ్చారు.
ఆమెను దత్తత తీసుకుని, ఆమె విద్యా ఖర్చులన్నీ తానే భరిస్తానని ప్రకటించారు. గత ఎన్నికల సమయంలో SVEEP కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న శివానికి, ఆమె కోరుకున్నంత వరకు చదువుకోవడానికి అన్ని విధాలా సహాయం చేస్తానని ఆయన తెలిపారు. శివాని ధైర్యం కోల్పోకుండా ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తానని కూడా హామీ ఇచ్చారు. శివాని కథ సాధారణ మనుషులందరికీ ప్రేరణ. శారీరక పరిమితులు లక్ష్య సాధనకు ఎప్పుడూ అడ్డు రావు అని నిరూపించిన ఈ ధైర్యవంతురాలి ప్రయాణం ఎందరో యువతకు బాటలు చూపుతుంది.
తాజావార్తలు
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Sai Kishore Hat-Trick: సాయి కిషోర్ సూపర్ షో.. హ్యాట్రిక్‌తో 6 వికెట్లు..! తమిళనాడు ఘన విజయం..
-
Drug Racket Busted: ఫార్మా ల్యాబ్‌ల ముసుగులో డ్రగ్స్ తయారీ.. హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు.!
-
Sajjala Ramakrishna Reddy : స్థానిక పోరుపై కూటమికి సజ్జల సవాల్
-
Uppal Flyover : 8 ఏళ్లుగా ఎదురుచూపులే.. ఉప్పల్ ఫ్లైఓవర్ ఎప్పటికి పూర్తి.?
ట్రెండింగ్
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!