RR vs DC: జస్ట్ మిస్! బ్యాట్‌తో కుల్దీప్ ముఖం పగులగొట్టబోయిన జడేజా.. ఒక్క క్షణం అంతా గందరగోళం!(వీడియో)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RR vs DC: రవీంద్ర జడేజా గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. అందరి ప్లేయర్స్‌తో ఎంతో సరదాగా ఉంటాడు. ఈ ఆల్‌రౌండర్‌ను మిగతా ప్లేయర్స్ తెగ ఇష్టపడుతుంటారు. అయితే.. తాజాగా జడేజాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో శుక్రవారం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరు కొనసాగింది. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా మధ్య జరిగిన సరదా సన్నివేశం క్షణకాలం పాటు అందరినీ ఉలిక్కిపడేలా చేసింది.
రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చిన సమయంలో ఢిల్లీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌తో సరదాగా ఆటపట్టించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో జడేజా తన బ్యాట్‌ను కుల్దీప్ ముఖం వైపు తిప్పగా, అది చాలా దగ్గరగా వెళ్ళింది. ఒక్క సెకను ఆలస్యమైనా అది కుల్దీప్‌కు బలంగా తగిలే ప్రమాదం ఉండేది. కానీ కుల్దీప్ వెంటనే వెనక్కి తగ్గడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగా, ఆ మరుక్షణమే ఇద్దరూ నవ్వుకుంటూ కనిపించడంతో స్టేడియంలోని వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సరదా సన్నివేశానికి సంబంధించిన వీడియోను ‘స్టార్ స్పోర్ట్స్ ఇండియా’ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “మస్తీ ఆగకూడదు” (Masti shouldn’t stop) అనే క్యాప్షన్‌ను జోడించింది. మైదానంలో ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ, బయట వీరిద్దరి మధ్య ఉన్న అన్నదమ్ముల వంటి బంధాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఇక కుల్దీప్ యాదవ్ రవీంద్ర జడేజాను తన పెద్దన్నలా భావిస్తారు. ఇటీవల లక్నోలో జరిగిన కుల్దీప్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు జడేజా తన భార్య రివాబాతో కలిసి హాజరై తన స్నేహాన్ని చాటుకున్నారు. మైదానంలో ఎంతటి తీవ్రమైన పోటీ ఉన్నా, టీమ్ ఇండియా సీనియర్, జూనియర్ల మధ్య ఉండే ఇటువంటి ఆత్మీయ సంబంధాలు క్రీడాభిమానుల మనసు గెలుచుకుంటున్నాయి.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
తాజావార్తలు
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
-
Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
-
UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!