Hardik Pandya: “ముంబై ఫ్లాప్ షో వెనుక అసలు కథ బట్టబయలు”.. కెప్టెన్ హార్దిక్‌కు మేనేజ్మెంట్ బిగ్ షాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలోనే అత్యంత సంచలన నిర్ణయాల్లో ఒకటిగా నిలిచే పరిణామం చోటుచేసుకోబోతోంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను తొలగించడానికి మేనేజ్మెంట్ సిద్ధమైంది. ఈ మేరకు ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రిక ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే, ఐపీఎల్ 2026 సీజన్లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టు.. ఆడిన 14 మ్యాచ్‌ల్లో ఏకంగా 10 మ్యాచ్‌ల్లో ఓడిపోయి, పాయింట్ల పట్టికలో 9వ స్థానంతో సరిపెట్టుకుంది. ముంబై జట్టు ఇంత ఘోరంగా విఫలం కావడంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ భవిష్యత్తుపై మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారు. దీనికి తోడు ముంబై ప్రయాణం ముగిసిన కొన్ని రోజులకే హార్దిక్ పాండ్యా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేయడం (ఆ తర్వాత మళ్లీ రీయాక్టివేట్ అయింది) ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాదు, కనీసం ఒక ప్లేయర్‌గా అయినా జట్టులో ఉంచాలా వద్దా? అనే దాని అంశంపై ముంబై మేనేజ్మెంట్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. “ఈ సీజన్ జరుగుతున్నప్పుడే అతడిని కెప్టెన్‌గా కొనసాగించడం జట్టు మేనేజ్మెంట్కు ఇష్టం లేదనే సంకేతాలు స్పష్టంగా కనిపించాయి. ముంబై క్యాంప్‌లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్” అని జట్టుకు చెందిన ఓ వ్యక్తి ఈ మీడియా సంస్థకు వెల్లడించారు. ఈ విషయమై ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి చెందిన కనీసం ముగ్గురు కీలక వ్యక్తులతో మాట్లాడినట్లు ఆ పత్రిక పేర్కొంది. అందులో ఓ వ్యక్తి మాట్లాడుతూ.. “సీనియర్ ఆటగాళ్లు ఎక్కడ ఆడినా సరే, వారు కోచ్‌ల మాట వినాలని (coachable) కోచింగ్ స్టాఫ్ ముందే స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఈ సీజన్లో కోచింగ్ స్టాఫ్ డేటా ఆధారంగా కొన్ని సూచనలు చేసినప్పటికీ, ఆటగాళ్లు వాటిని పాటించని సందర్భాలు చాలానే ఉన్నాయి” అని అసంతృప్తి వ్యక్తం చేశారు. ముంబై ఇండియన్స్‌కు చెందిన మరో పాత శ్రేయోభిలాషి మాట్లాడుతూ.. “రాబోయే రోజుల్లో దీనిపై తీవ్రమైన ఆత్మపరిశీలన, సుదీర్ఘ చర్చలు జరుగుతాయి. జట్టు ముందున్న ప్రతి ఆప్షన్‌ను పరిశీలిస్తాం. ఎందుకంటే చాలా ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సి ఉంది. మున్ముందు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా కొనసాగగలడా? లేదా కేవలం ఒక ఆటగాడిగా మాత్రమే జట్టులో ఉంటాడా? అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి” అని వ్యాఖ్యానించారు. మొత్తానికి, ఐపీఎల్ 2026లో ముంబై జట్టు చవిచూసిన పరాభవం.. హార్దిక్ పాండ్యా కెరీర్‌ను పెద్ద మలుపు తిప్పేలా కనిపిస్తోంది.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
తాజావార్తలు
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!