IPL Record: ఐపీఎల్ కింగ్ కోహ్లీ కాదు.. ఎవరో తెలుసా? విస్తుపోయే గణాంకాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL Record: ఐపీఎల్‌లో రికార్డులు, అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ ఎవరు? అని అడగ్గానే టక్కున గుర్తుకు వచ్చే పేరు కింగ్ కోహ్లీ. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు, సెంచరీల రికార్డులు విరాట్ పేరిటే ఉన్నాయి. కానీ.. తాజాగా షాకింగ్ గణాంకాలు వెలువడ్డాయి. ఓ ప్లేయర్ ఏకంగా కోహ్లీని మించిపోయాడు. 2026 సీజన్ నాటికి విరాట్ కంటే అత్యంత నిలకడైన బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ రికార్డు సృష్టించాడు. కనీసం 50 ఇన్నింగ్స్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే.. కేఎల్ రాహుల్ బ్యాటింగ్ సగటు ఇతరుల కంటే దాదాపు 10 శాతం ఎక్కువగా ఉంది. వరల్డ్ టీ20 క్రికెట్‌లో కోహ్లీ తోపు అయినా.. ఐపీఎల్‌లో మాత్రం కింగ్ కేఎల్ రాహుల్. ఐపీఎల్‌లో రాహుల్ 45.67 సగటుతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. హెన్రిచ్ క్లాసెన్ (40.57) రెండు, డేవిడ్ వార్నర్ (40.52) మూడు, శుభ్‌మన్ గిల్ (40.36) నాలుగో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఐదో స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ (39.95) నిలవగా.. విరాట్ కోహ్లీ 39.76 సగటుతో ఆరో స్థానానికి పరిమితమయ్యాడు.
READ MORE: మైత్రీ – ప్రశాంత్ నీల్ ‘418’ టైటిల్ పోస్టర్ రిలీజ్ ..
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
2013లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన రాహుల్, ఈ లీగ్‌లో ఐదు జట్ల తరఫున ఆడాడు. గతంలో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ESPNcricinfo ప్రకారం , రాహుల్ 140 ఇన్నింగ్స్‌లలో 5,333 పరుగులతో తన 150వ మ్యాచ్‌లోకి అడుగుపెట్టాడు. ఐపీఎల్‌లో రాహుల్ ఐదు శతకాలు సాధించాడు. 41 హాఫ్ సెంచరీలు చేశాడు. 2018లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ప్రస్తుతం PBKS) తరఫున ఆడుతూ, రాహుల్ ఢిల్లీ జట్టుపై 14 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. IPL చరిత్రలో ఒక ఓపెనర్ చేసిన రెండవ అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ ఇది. రాహుల్ ఏడు సీజన్లలో 500 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు. ఈ జాబితాలో కోహ్లీ (8 సార్లు) మాత్రమే అతని కంటే ముందున్నాడు. ముఖ్యంగా, రాహుల్ 2020లో 670 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్‌లో 150 మ్యాచ్‌లు పూర్తి చేశాడు. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఇటీవల జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. 45కు పైగా సగటుతో 5,000కు పైగా పరుగులు సాధించిన రాహుల్, లీగ్ చరిత్రలోనే అత్యంత నిలకడైన బ్యాటర్లలో ఒకడిగా నిలిచాడు.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!