Vaibhav Sooryavanshi: అది బ్యాటింగ్ కాదు.. వైభవ్ బ్యాట్‌లో ఏదో ఉంది.. కీలక వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఆటగాళ్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్ల మధ్య జరిగిన పోరు తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. కేవలం 29 బంతుల్లోనే 12 సిక్సర్ల సాయంతో 97 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఈ క్రమంలోనే ఒకే ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ రికార్డును సూర్యవంశీ బద్దలు కొట్టాడు. అంతేకాదు, గేల్ పేరిట ఉన్న వేగవంతమైన టీ20 సెంచరీ రికార్డుకు కేవలం మూడు పరుగుల దూరంలో నిలిచి దురదృష్టవశాత్తూ అవుటయ్యాడు.
అయితే, సూర్యవంశీని అవుట్ చేసిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ ప్రఫుల్ హింగే జరుపుకున్న దూకుడు సెలబ్రేషన్ సోషల్ మీడియాలో వివాదానికి దారితీసింది. హింగే ఆ యువ బ్యాటర్ వైపు తిరిగి, కళ్లలోకి చూస్తూ చేసిన అతిగా ప్రవర్తించడం చాలా మంది అభిమానులకు నచ్చలేదు. ఆ మ్యాచ్‌లో బౌలర్లందరినీ ఉతికారేసిన సూర్యవంశీపై అంతటి ‘అతి’ సెలబ్రేషన్ అవసరం లేదంటూ నెటిజన్లు హింగేపై మండిపడుతున్నారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
Praful Hinge celebrated passionately after taking the prized wicket of Vaibhav Sooryavanshi. But Vaibhav remained standing far away from the crease, completely shattered and unable to process that he had fallen on 97. Even Abhishek Sharma came over to console the young batter… pic.twitter.com/YGa0PkRBo1
— Faruk (@uf2151593) May 27, 2026
Praful Hinge was absolutely shameless. He was mocking Vaibhav Sooryavanshi after getting him out, while Ishan Kishan and Abhishek Sharma were appreciating Vaibhav 🫡❤️ pic.twitter.com/UixPUQoNvw
— Indian Cricket Ministry (@ICM_News45) May 28, 2026
The celebration by Praful Hinge after getting Vaibhav Sooryavanshi. pic.twitter.com/rpLziBQJrY
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 27, 2026
మరోవైపు, ఈ 15 ఏళ్ల టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆటతీరుపై క్రికెట్ దిగ్గజాలు ప్రశంసల వర్షం కురిపించారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. “సూర్యవంశీ బ్యాట్ స్వింగ్ అద్భుతంగా ఉంది. లెగ్ సైడ్ వచ్చే బంతులను ఆడేందుకు అతను ఫ్రంట్ ఫుట్‌ను పక్కకు జరిపి ఆడే విధానం మరింత విశేషమైనది. ఈ స్వేచ్ఛే అతన్ని ఇలా ఆడేలా చేస్తోంది. ఇదొక అద్భుతమైన ఇన్నింగ్స్” అని కొనియాడారు. అంతే కాదు.. అతడు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆ బ్యాట్‌లో ఏదో స్ప్రింగ్ పెట్టుకొని వచ్చాడా అనే రేంజిలో బ్యాంటింగ్ ఉందంటూ చమత్కరించారు.
భారత మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కూడా “బాస్ బేబీ (సూర్యవంశీ) వరల్డ్ బాస్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ కిడ్ ఆటను చూడటం నమ్మశక్యం కాని అనుభూతి” అని ట్వీట్ చేశాడు. అలాగే సురేష్ రైనా స్పందిస్తూ.. “ఈ టోర్నమెంట్లో వైభవ్ చేసిన దాన్ని వర్ణించడానికి డిక్షనరీలో పదాలు సరిపోవు. అతని బ్యాటింగ్ చూడటానికి ప్రజలు ఎదురుచూస్తున్నారంటేనే భారత క్రికెట్ భవిష్యత్తు సురక్షితమైన చేతుల్లో ఉందని అర్థమవుతోంది” అని ప్రశంసించారు.
తాజావార్తలు
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
-
Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!